4వేల అశ్లీల వెబ్ సైట్ల కు చెక్ పెట్టిన చైనా

Four Thousand Websites Banned In China

11:59 AM ON 8th December, 2016 By Mirchi Vilas

Four Thousand Websites Banned In China

ప్రతిదేశంలో అస్లీల వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇక ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వెబ్ సైట్లపై డ్రాగన్ చైనా కొరడా ఝుళిపించింది. అశ్లీల, అసభ్య సమాచారంతో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారాలను చేస్తున్న సుమారు 4వేలకు పైగా వెబ్ సైట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. కొత్తగా వచ్చిన సైబర్ స్పేస్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వాటిని తొలగించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ‘హింస, అశ్లీల, అసభ్య సమాచారం నిండిన లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్లను చైనా మూసేసింది’ అని జిన్ హువా న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది.

చైనా ప్రభుత్వం నవంబర్ లో సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి నియమ, నిబంధలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం భద్రత, అస్థిర సమాజం, సామాజిక క్రమానికి విఘాతం కలిగించడం, పోర్నోగ్రఫీతో సహా వ్యర్థ సమాచారాన్ని ఏ వెబ్ సైటూ అందించకూడదు. చైనా రాజధాని బీజింగ్ వేదికగా అసభ్య సమాచారాన్ని అంతర్జాలంలో ఉంచుతున్న సుమారు 4000 వెబ్ సైట్లను ప్రభుత్వం తొలగించింది.

నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో ఇంటర్నెట్ వ్యవస్థకు భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రత్యామ్నాయ మాధ్యమాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా 4జీ, 5జీ సౌకర్యాలతో లైవ్ స్ట్రీమింగ్ ల ద్వారా కార్యక్రమాలను వీక్షించడం అక్కడ సర్వ సాధారణమైపోయింది. దీంతో చైనా నూతన నిబంధనలు తీసుకొచ్చింది. పోర్నోగ్రఫీ విస్తరించకుండా చేయడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం గా చెప్పుకొస్తున్నారు.

ఇది కూడా చూడండి: పులి చర్మంపై గల చారల వెనుక అసలు రహస్యం ఇదే!

ఇది కూడా చూడండి: తల్లి ఎంగేజ్మెంట్ రింగ్ కొట్టేసి.. ఆ బుడతడు ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు(వీడియో)

ఇది కూడా చూడండి: పెళ్లికాని ప్రసాద్ లు.. బి కేర్ ఫుల్!

English summary

Four Thousand Websites Banned In China. China Government decided to ban porn websites.