రెజ్లర్ పై బ్యాన్

Four Years Ban On Wrestler Narsingh Yadav

11:14 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Four Years Ban On Wrestler Narsingh Yadav

ఓ పక్క ఆశాదీపంలా ఒక పతకం వచ్చి, మరో పతకం ఖాయం కాగా మరోపక్క భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నిషేధం వేటు పడింది. డోపింగ్ కేసులో అతనిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు సీఏఎన్ ప్రకటించింది. దీంతో రియో ఒలంపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని ఈ రెజ్లర్ కోల్పోయాడు. బరిలో దిగకుండానే వెనుదిరిగాడు. రియో డీ జెనీరో లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ నుంచి క్లియరెన్స్ పొందడంలో నర్సింగ్ విపలమయ్యాడు.

తనపై కుట్ర జరిగిందన్న ఇతని వాదనను ఈ ప్యానెల్ అంగీకరించలేదు. నర్సింగ్ తప్పిదమేమీ లేదని భావించడానికి ఆధారాలు లేవని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ నిర్ణయంతో తామెంతో బాధ పడుతున్నామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. నర్సింగ్ యాదవ్ ఎవరో చేసిన కుట్రకు బలయ్యాడని అంటున్నారు.

English summary

Indian Wrestler Narsingh Yadav have been banned for 4 long years CAS and with this decision he was back to India without participating in Rio Olympics.