పాపం, పుట్టుకతోనే వృద్ధాప్యం వచ్చేసింది .. షాకింగ్ న్యూస్

Four Years Old Boy Bayezid Hossain Suffering With Progeria Disorder

11:39 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Four Years Old Boy Bayezid Hossain Suffering With Progeria Disorder

అవునా అంటే అవుననే అంటున్నారు. అసలే వృద్ధాప్యం శాపం అంటారు. ఆలంటిది పుట్టకతోనే వృద్ధాప్యం ముంచుకువస్తే అది ప్రత్యక్ష నరకమే. 'కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు' అంటూ గతంలో ఓ విప్లవ గీతం వచ్చింది. కానీ ఇది నిజంగా పుట్టుకతో వృద్ధాప్యం. వివరాల్లోకి వెళ్తే, దక్షిణ బంగ్లాదేశ్ లోని ఓ బుడతడు ఇలాంటి వైకల్యంతోనే బాల్యంలోనే వృద్ధాప్య దశను అనుభవిస్తూ క్షణమొక యుగంలా బతుకు గడుపుతున్నాడు. ఇది ఆతని తల్లిదండ్రులను కలిచివేస్తోంది.

ఆ బాలుడి పేరు బయెజిద్ హుస్సేన్. పుట్టి నాలుగేళ్లే అయినా పది రెట్లు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. వైద్యపరిభాషలో అతనికి ఉన్న జన్యుపరమైన లోపాన్ని 'ప్రిజేరియా' అని పిలుస్తారు. ఉబ్బిపోయిన ముఖం, అంటుకుపోయిన దవడలు, వేలాడుతున్న చర్మం, మూత్రవిసర్జన కష్టంకావడం, పళ్లు బలహీనంగా, విరిగిపోయినట్టు ఉండటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ బయెజిద్ లో చోటుచేసుకోవడంతో ఆ ఈడు పిల్లలు కూడా అతనితో ఆడుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిని చూసి తల్లి త్రిప్తి ఖతున్ తల్లడిల్లిపోతోంది. 'బయెజిద్ మూడేళ్ల వయస్సులో నడవడం నేర్చుకున్నాడు. ఆ వయస్సులోనే అతనికి అన్ని పళ్లూ వచ్చేశాయి. అసాధారణరీతిలో శారీరక ఎదుగుదల ఉన్నప్పటికీ మానసికంగా ఎదగలేదు. అయినా ఎంతో చక్కగా మాట్లాడతాడు. వయసుకు మించిన గ్రాహ్యశక్తి ఉంది' అంటూ తల్లి త్రిప్తి వెల్లడించింది. తన పిల్లవాడు ఇతర పిల్లల్లా చూడలేడని, వృద్ధాప్యంలో ఉన్న మనిషిలా ఉంటాడని వాపోయింది. తనకు కలిగిన మొదటి సంతానమే ఇలా కావడం తనను కలిచివేస్తోందంటూ కంటతడి పెడుతోంది.

సహజంగా ప్రిజేరియాతో బాధపడుతున్న వారి జీవనప్రమాణం 13 ఏళ్ల వరకూ ఉంటుంది. గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తన కుమారుడు పుట్టినప్పటి నుంచి తాము కలవని డాక్టరు కానీ, సంప్రదించని వ్యక్తులు కానీ లేరని బయెజిద్ తండ్రి లవ్లు అంటున్నాడు. ఇప్పటి వరకూ 4 వేల పౌండ్లకు పైగా ఖర్చు చేశామని, అయితే ఎవరికీ వైద్యం అంతుపట్టలేదని వాపోయాడు. 'ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. పైగా రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది' అని చెప్పుకొచ్చాడు. తన కుమారుడు అందరిలాంటి పిల్లవాడు కాదని, కన్నకొడుకు రోజురోజుకూ మృత్యువుకు చేరువవుతున్నాడని తెలిసిన ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని తండ్రి తల్లడిల్లి పోతున్నాడు. ఇది నిజంగా విచిత్రంగా వున్నా, కన్నవారికి మాత్రం విషాదం మిగులుస్తోంది.

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

English summary

Four Years Old Boy Bayezid Hossain Suffering With Progeria Disorder.