జగన్ కి ఝలక్ - టిడిపి గూటికి ఎంఎల్ఏ లు

Four Ysrcp MLA's Joined In TDP

09:59 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Four Ysrcp MLA's Joined In TDP

'టిడిపి నుంచి 21మంది ఎంఎల్ఏలు టచ్ లో వున్నారు. వాళ్ళు వచ్చేస్తే, టిడిపి ప్రభుత్వం వెంటనే పడిపోతుంది' అంటూ వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించి, నాలుగు రోజులు గడవక ముందే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్ఎ లు , ఓ ఎంఎల్సి మూకుమ్మడిగా టిడిపిలో చేరిపోయారు. జగన్ కి ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో సోమవారం రాత్రి వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఎ లు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్‌ తెలుగుదేశంలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టిడిపిలో చేరారు.

గత కొన్ని నెలల నుంచి కడప జిల్లా జమ్మలమడుగు ఎంఎల్ఎ ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇక గత కొద్దిరోజులుగా కొందరు వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరుతారని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో సోమవారం ఏపీ రాజకీయాలు శరవేగంగా మారాయి. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన నంద్యాల, జమ్మలమడుగు నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వైస్సార్ కాంగ్రెస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని పార్టీలోకి చేర్చుకుంటామని ప్రకటించారు. ఇక ఎన్నాళ్ళ నుంచి ఆదినారాయణ రెడ్డి చేరికను వ్యతికిస్తున్న జమ్మలమడుగు తెలుగుదేశం నేత రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడివుంటామన్నారు.

తెలంగాణాలో అధికార టిఆర్ఎస్ వైపు టిడిపి ఎంఎల్ఏలు జంప్ అవుతుంటే , ఎపిలో అధికార టిడిపి లోకి విపక్ష వైస్సార్ కాంగ్రెస్ ఎంఎల్ఏలు చేరుతున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ వైపు ప్రతిపక్ష ఎంఎల్ఎల అడుగులు పడుతున్నాయి.

English summary

Four Ysrcp MLA's and One MLC joined in Telugu Desam Party. YSRCP MLA Bhuma Nagi Reddy and his daughter Allagadda MLA Akhila Priya ,Adinarayana Reddy representing Jammalamadugu in Kadapa and Jaleel Khan of Vijayawada (West) constituency has joined Telugu Desam Party in the presence of its Chief Chandrababu Naidu on Monday evening. MLC Narayana Reddy also joined TDP along with them.