ఐష్ కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

France Award To Ishwarya Rai

05:41 PM ON 27th January, 2016 By Mirchi Vilas

France Award To Ishwarya Rai

భారత రిపబ్లిక్ వేడుకలకు హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో హోలాన్ గౌరవార్దం ఇచ్చిన విందులో ఐష్ సందడి చేసింది. ఎర్రరంగు చీరలో మిల మిల మెరిసిపోతూ, తలలో రెండు గులాబీలు పెట్టుకుని వచ్చిన ఐశ్వర్యారాయ్ ప్రత్యేక ఆకర్షణ అయింది. విందుకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఆమె తన కుమార్తె ఆరాధ్యతో కలిసి వెళ్లి, ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ఆమె భోజనం చేసారు. కొద్దిసేపు మాట కలిపింది. ఇక బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ - ఆదిత్య చోప్రా - మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ విందుకు హాజరయ్యారు.

కాగా ఐశ్వర్యకు ఫ్రాన్స్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన ''నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్సు అండ్ లెటర్స్" ప్రదానం చేశారు. అలాగే షారూక్ కు ''ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్'' పురస్కారం అందించారు. ఇంతకీ ఐశ్వర్య రాయ్ కి ఫ్రాన్సుతో 14 ఏళ్లుగా ప్రత్యేక అనుబంధం సాగుతోంది. అదేంటంటే, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు భారత తరఫున ఆమె శాశ్వత ప్రతినిధిగా గడిచిన 14 ఏళ్లుగా క్రమం తప్పకుండా హాజరవుతూ భారత్ - ఫ్రాన్సుల మధ్య సాంస్కృతిక వారధిగా వుంటున్నారు.

English summary

Bollywood actress Ishwarya Rai gets invitation and she attended to lunch with france president on Republic Day. Ishwara Rai, Shahrukh Khan,Aditya Chopra and few other bollywood celebrototes were attended to this event. On this occassion france government announced "Nights of the order of arts and letters" award to Ishwarya Rai And "Order Des Arts At Des Letters" award to King Khan ShaRukh Khan