కమల్ కు ఫ్రాన్స్ ప్రభుత్వ అవార్డు

France Chevalier Award for Actor Kamal Haasan

11:21 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

France Chevalier Award for Actor Kamal Haasan

విభిన్న పాత్రలు ఎంచుకుని, కష్టమైనా సరే ఇష్టంగా మలచుకుని ప్రేక్షకులను మెప్పించడంలో దిట్ట విశ్వనటుడు కమల్ హాసన్. ఎన్ని అవార్డులు, పురస్కారాలు పొందిన కమల్ తాజాగా మరో అరుదైన గౌరవం పొందాడు. కమల్ కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా సినీ రంగానికి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘చెవాలియర్ డి ఎల్ ఆర్డర్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్ (ద నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ )’ పురస్కారాన్ని ప్రకటించింది.

ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కళలు, సాహిత్య రంగంలో విశేష సేవలందించే వారిని ఈ పురస్కారంతో ఆ దేశం సత్కరిస్తోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే పౌర పురస్కారాల్లో 13వ స్థానంలో ఉండే అవార్డు ఇది. దీంట్లో మూడు గ్రేడ్ లు ఉంటాయి. మొదటిది కమాండర్ గ్రేడ్ . దీన్ని ఏడాదికి 20 మందికి ప్రకటిస్తారు.

రెండో గ్రేడ్ .. ఆఫీసర్ . దీన్ని ఏడాదికి 60 మందికి ప్రకటిస్తారు. మూడో గ్రేడ్ చెవాలియర్ (నైట్ -యోధుడు). దీన్ని ఏడాదికి 200 మందికి ప్రకటిస్తారు. కమల్ కు ప్రకటించిన పురస్కారం ఇదే. కాగా.. చెవాలియర్ పురస్కారానికి కమల్ ఎంపిక కావడం పట్ల భారతీయ, తమిళ సినీ పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెల్పారు.

కాగా, ఈ అవార్డును తన మార్గదర్శులు, ప్రేక్షకుకు అంకితమిస్తున్నట్లు కమల్ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ఆర్ట్స్ అండ్ లెటర్స్ విభాగంలో ఫ్రెంచ గవర్నమెంట్ నాకు చెవాలియర్ ప్రకటించడం సంతోషంగా ఉంది. నన్ను ఇంతవాడిని చేసిన మార్గదర్శులకి, నాలుగేళ్ల ప్రాయం నుండి నా నటనను చూసి ప్రోత్సహించి ఆదరిస్తున్న ప్రేక్షకులకి ఈ అవార్డుని అంకితమిస్తున్నా’ అని కమల్ తెల్పడం విశేషం.

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

English summary

Kamal Haasan is an Indian film actor, screenwriter, director, producer, playback singer, choreographer, lyricist, philanthropist and dancer now he has been chosen for the French honor of Chevalier Award.