జల్సాల వైఫ్ కోర్కెలు తీర్చాడు -- ఇద్దరూ కటకటాల పాలయ్యారు

Fraud Couple Radhika and Pankaj Oswal

11:06 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Fraud Couple Radhika and Pankaj Oswal

భార్యా భర్తల్లో ఎవరో ఒకరు ఒబ్బిడి గా ఉంటే పర్వాలేదు. లేదంటే ఆసంసారం ఇక రోడ్డున పడుతుంది. అంతేకాదు, అప్పులు చేసి షోకులకు పోతే , జల్సాలు చేస్తే, ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది కూడా. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. నువ్వు కోరుకుంటే కొండ మీద కోతినైనా తెస్తానన్నాడు. అయితే పెళ్లికి ఓకేఅంది.. అంతేకాదు, పెళ్లాం చెబితే వినాలని కండీషన్ పెట్టింది. ఆమెగొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు ఆ మొగుడు తను పని చేస్తున్న కంపెనీ ఫండ్స్ ను మంచినీళ్లలా ఖర్చు చేసేసాడు. చివరకు ఆ మొగుడూ, పెళ్ళాలను పోలీసులు అరెస్ట్ చేసి డబ్బు కట్టించేపనిలో పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆమె పేరు రాధికా ఓశ్వాల్, అతని పేరు పంకజ్. అందంగా ఉండే రాధికాను పెళ్ళిచేసుకోవాలనుకున్న పంకజ్ కు అతని భార్య ఓ కండీషన్ పెట్టింది. తన కోర్కెలు తీర్చితేనే మనిద్దరికీ పెళ్ళి జరుగుతుందనడంతో, నచ్చిన దానిని వదులుకోలేక పంకజ్ ఒకే చేసాడు.

ఒక ఫర్టిలైజర్ ప్లాంట్ లో మేనేజర్ గా పనిచేసే పంకజ్ భార్య గొంతెతమ్మ కోర్కెలు తీర్చడం కోసం, భార్యాభర్తల విలాసాల కోసం 150 మిలియన్ డాలర్లు సొమ్ము స్వాహా చేసేశాడు. ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, యాచింగ్ క్లబ్ లు, ప్రవేట్ జెట్ ల్యాండ్, మాన్షన్లు కొనుగోలు చేశారు. తను పని చేసే కంపెనీ సొమ్ములో 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి భార్యా భర్తలిద్దరూ ట్రస్టీలుగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకున్నారు. మరో 11 మిలియన్ డాలర్లు కొట్టేసి ఖరీదైన మాన్షన్ కట్టేందుకు రెడీ అయ్యారు. అలానే మరో ఎనిమిది మిలియమన్ డాలర్లతో లండన్, న్యూయార్క్ లో చైన్ వెజిటేరియన్ రెస్టారెంట్లు పెట్టారు. వీటితో బాటు సొంతంగా అయిదు మిలియన్ డాలర్లు తో ఒక ఫాం, మూడు మిలియన్ డాలర్లతో లగ్జరీ బోట్, మరో మూడు మిలియన్ డాలర్లు ఫ్లైట్ టిక్కెట్స్ కొనుగోలు చేశారు. అంతటితో ఆగలేదు, అయిదు లక్షల డాలర్లతో యాస్టన్ మార్టిన్ కారుకు ఆర్డరిచ్చారు. వాళ్ల పిల్లల స్కూలు ఖర్చుల కోసం 1.3డాలర్లు పెట్టాడు. భార్య కోరిక మేరకు విలాసాలు అన్నీ తీర్చాడు. కంపెనీ సొమ్ము వాడేయడంతో, జల్సా భార్యాబర్తలిద్దరినీ కోర్టులో విచారిస్తున్నారు. మొత్తానికీ ఎరువుల కంపెనీ సొమ్ము మేసి ఏపుగా ఆస్తులు పెంచుకున్నారు చివరికి పోలీసులకు చిక్కాడు.

ఇది కూడా చూడండి: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

ఇది కూడా చూడండి: మీ మనస్తత్వం ఏంటో మీరు పుట్టిన నెలతో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

English summary

Fraud Couple Radhika and Pankaj Oswal.