ఈ ఫోన్లతో ఏడాది ఫ్రీ ఇంటర్నెట్‌

Free Internet With This Phone

03:56 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Free Internet With This Phone

దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ డేటావిండ్‌ భారత మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. పాకెట్‌ సర్ఫర్‌ 2జీ4ఎక్స్‌, పాకెట్‌ సర్ఫర్‌ 3జీ4జెడ్‌ పేరిట వీటిని రిలీజ్ చేసింది. 2జీ 4ఎక్స్ ధర రూ.2,499 కాగా, 3జీ4జెడ్ ధర రూ.3,999 అని కంపెనీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రిటైల్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లతో పాటు కంపెనీ ఓ స్పెషల్ ఆఫర్‌ని కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు సంవత్సరంపాటు ఉచితంగా ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తోంది. అయితే.. వినియోగదారులు కచ్చితంగా రిలయన్స్‌, టెలినార్‌ సిమ్‌లను ఉపయోగించాలి.

పాకెట్‌ సర్ఫర్‌ 2జీ4ఎక్స్‌ ఫీచర్లు

3.5 అంగుళాల తాకే తెర, 1గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 0.3 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 256ఎంబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 4.2.2 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ స్టోరేజీ సామర్థ్యం మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

పాకెట్‌ సర్ఫర్‌ 3జీ 4జెడ్‌ ఫీచర్లు

4 అంగుళాల తాకే తెర, 1గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 0.3మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, 512ఎంబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 4.4.2 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4జీబీ స్టోరేజీ సామర్థ్యం మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

This Datawind PocketSurfer 3G4Z smartphone is powered by 1GHz and it comes with 512MB of RAM.This phone was launched in January of this year.Datawind provides free internet for one year with this smartphone