ఫోన్ లోనూ 'ఫొటోషాప్’

Free Light Room Photoshop App

04:49 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Free Light Room Photoshop App

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీసీ యూజర్లలో అధిక శాతం మంది వాడుతున్న ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ 'ఫొటోషాప్'. అడోబ్ సంస్థకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ కొంత మార్పు చెంది 'లైట్ రూం' పేరిట కూడా పీసీ, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని వాడుకోవాలంటే గతంలో కొంత రుసుం చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం ఎలాంటి రుసుం లేకుండానే 'PHOTOSHOP LIGHTROOM' యాప్‌ను వాడుకునే వెసులుబాటు కలిగింది.. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ ఇప్పటికే ఉచితంగా లభిస్తుండగా, తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా దీన్ని ఫ్రీగా అందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా డివైస్‌లోని ఫొటోలను మనకు కావల్సిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉండే ఫిల్టర్స్, ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి మన ఫొటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు.

English summary

Adobe introduces its new app for windows pc's and smart phones.The app name is called "PHOTOSHOP LIGHTROOM" this app allows the user to add filters ,effects to the image for free