అక్కడ కూడా ఫ్రీ వై-ఫై

Free Wfi services in Cremation ground

04:25 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Free Wfi services in Cremation ground

వైర్‌లెస్ ఇంటర్నెట్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కేఫ్‌లు, మెట్రో రైళ్లలో ఉచితంగా వై-ఫై వస్తోంది. అయితే ఇప్పుడు వైఫై సేవలు శ్మశానవాటికల్లోనూ లభించనున్నాయి. రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న కీలక శ్మశాన వాటికల్లో పౌరులకు ఉచిత వై-ఫై సేవలు అందించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మాస్కోలోని వాగన్‌కోవా, టోరికోవా, నోవాడెవిచి శ్మశానవాటికల్లో వైఫై సేవలు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. సోవియట్ నేతలు నికితా కురుచ్చేవ్, బోరిస్ ఎల్సిన్ సమాధులు ఉన్న శ్మశానవాటికలో ముందుగా ఆ సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రముఖ వ్యక్తుల సమాధుల దగ్గరకు వచ్చిన వై-ఫై యూజర్స్ ఆ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ ప్లాన్ సక్సెస్ అయితే నగరంలోని 133 శ్మశానవాటికలకు ఉచిత వైఫై సేవలను విస్తరిస్తారట.

English summary

Russia providing free wifi services in Various Cremation grounds in Moscow."People often come and find themselves standing in front of a grave and want to know more about the person lying there."