సిటీ బస్సుల్లో ఉచిత వైఫై

Free Wifi Services In Telangana RTC City Buses

10:21 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Free Wifi Services In Telangana RTC City Buses

అందివచ్చిన టెక్నాలజీని ఎవరికీ తోచిన రీతిలో వారు వాడుతున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఇందుకనుగునంగా వినూత్న పథకం చేపట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఏసీ, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం ప్రకటించారు. ప్రయాణికులకు తొలి 30 నిమిషాలు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తారు. కాగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల బాడీల మార్పు దశల వారీగా చేపట్టనున్నట్లు ఈడీ తెలిపారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల బాడీలను మార్చనున్నట్లు తెలిపారు. 2015-16లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఆర్టీసీకి రూ.289 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఆకట్టుకుని నష్టాల వూబి నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

English summary

Telangana RTC take a forward step to bring back Profit to Telangana RTC. Telangana RTC decided to bring free Wifi Services in Telangana RTC Buses.