మరో వివాదంలో ఫ్రీడం 251

Freedom 251 Accused Of Cheating And Fraud By Its Customer Service Provider

01:06 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Freedom 251 Accused Of Cheating And Fraud By Its Customer Service Provider

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చౌక ధరకే ఫ్రీడమ్‌ 251 స్మార్ట్‌ఫోన్‌ అని ప్రకటించిన రింగింగ్‌ బెల్స్‌ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. రింగింగ్ బెల్స్ తమను మోసం చేసిందని రింగింగ్‌బెల్స్‌కి కస్టమర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న సై ఫ్యూచర్‌ సంస్థ ఆరోపించింది. తమకు ఇవ్వాల్సిన డబ్బును రింగింగ్‌ బెల్స్‌ చెల్లించడం లేదని చెప్పింది. ఈ విషయమై సై ఫ్యూచర్‌ సీఈఓ అనుజ్‌ బైరతి మాట్లాడారు. తొలి నుంచీ మాకు రింగింగ్‌ బెల్స్‌పై పలు అనుమానాలు ఉన్నాయని, దాని వ్యాపార విధానాన్ని బాగా పరిశీలించి, ఆ సంస్థ అధికారులతో పలు మార్లు చర్చలు జరిపిన తరువాతనే వారికి కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చామని, ఫోన్‌ విడుదల కార్యక్రమానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తున్నారని తెలియడంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఫోన్‌ విడుదల తరువాత తమకు లక్షల్లో కాల్స్‌ వచ్చాయని, వాటన్నింటినీ రిసీవ్‌ చేసుకుని సరిగ్గా స్పందించామని, తమ సేవలతో రింగింగ్‌ బెల్స్‌ కూడా సంతృప్తి చెందిందని పేర్కొన్నారు. వారానికోసారి చొప్పున మాకు చెల్లింపులు చెయ్యాలని ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, అయితే తాము డబ్బులు చెల్లించమని అడగడం మొదలు పెట్టేసరికి ఆ సంస్థ మరోలా మాట్లాడుతోందని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, ఇది పూర్తిగా మోసమని ఆరోపించాడు. అయితే కస్టమర్‌ సర్వీసుకు భారీ సంఖ్యలో వచ్చిన కాల్స్‌ని తీసుకోవడంలో సైఫ్యూచర్‌ విఫలమైందని రింగింగ్‌ బెల్స్‌ చెబుతోంది. సంతృప్తికరమైన సేవలందించలేదని సైఫ్యూచర్‌తో లావాదేవీలు నిలిపేయాలని నిర్ణయించింది.

English summary

Ringing Bells has been accused of "fraud" and non-payment of dues by its customer service provider .