ఫ్రీడం.. గూగుల్‌నే మించిపోయింది..

Freedom 251 sells Just 30 thousand Units

11:40 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Freedom 251 sells Just 30 thousand Units

ఫ్రీడం.. నాలుగురోజుల క్రితం వరకూ ఈ స్మార్ట్ ఫోన్ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఇది ఎంతగా ప్రజల్లోకి వెళ్లిపోయిదంటే కోట్లాదిమంది నిరంతరం ఉపయోగించే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని సైతం మించిపోయింది. ఫ్రీడం 251 ఫోన్ ను రూ.251కే అందిస్తామని ప్రకటించిన నోయిడాకు చెందిన రింగింగ్‌బెల్స్‌ కంపెనీ బుకింగ్స్‌ను గురువారం ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫోన్‌ను కొనేందుకు యువత పోటిపడింది. గురువారం ఉదయం నుంచే ఫ్రీడం 251.కామ్ వెబ్‌సైట్‌కు లాగిన్‌ కావ్వడంతో కొద్ది క్షణాల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన వెంటనే.. ఫ్రీడం 251 వెబ్‌సైట్‌కు సెకన్ కి ఆరు లక్షల హిట్స్‌ వచ్చాయి. ఇదే సమాయంలో గూగుల్‌కు సెకన్ కు 40వేల హిట్లొచ్చాయి. అనూహ్యంగా హిట్లు రావడంతో ఫ్రీడం సైట్ సర్వర్‌ ఆగిపోయింది. కాగా, 24 గంటల్లో అప్‌గ్రేడ్‌ చేసి బుకింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామని రింగింగ్‌బెల్స్‌ ప్రకటించింది. ఇప్పటి వరకూ 30 వేల ఆర్డర్లు మాత్రమే తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.

English summary

The Ringing Bell Freedom 251 smartphone, officially launched on Wednesday night.The number of handsets that have actually been sold to customers from the freedom251.com website was just 30,000 .