రేపిస్ట్ నాలుక కొరికి తప్పించుకున్నయువతి

French woman bites off tongue of Rapist

10:55 AM ON 14th May, 2016 By Mirchi Vilas

French woman bites off tongue of Rapist

అవునా, ఇదేమి చిత్రం అనుకుంటున్నారా? నిజం, కానీ ఆమె అలా ఎందుకు చేసిందో, తెలిస్తే శెభాష్ అంటారు. అయితే వివరాల్లోకి వెళ్దాం. జులాయిలకు, అమ్మాయిలను అల్లరిపెట్టే ఆకతాయిలకు ఓ ప్రాంతం , ఓ దేశం అనే తేడాలేదు దేశమేదైనా.. మహిళలపై వేధింపులు మాత్రం మామూలే. ఈ క్రమంలో కొందరు మృగాళ్లకు బలైపోతుండగా మరికొందరు మాత్రం తప్పించుకోగలుగుతున్నారు. అయితే ఈ యువతి మాత్రం చాలా తెలివిగా ఆలోచించి రేపిస్ట్ నుంచి తప్పించుకుంది. దక్షిణ ఫ్రాన్స్‌ ప్రాంతమైన టౌలైజ్‌లోని పర్పాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

ఇవి కూడా చదవండి:మెగా మూవీ కి మళ్ళీ బ్రేక్ ?

స్థానికంగా నివాసముండే ఓ యువతి(19) ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను వేధిస్తూ, ఓ యువకుడు(24) వెంబడించాడు. ఆమె ఇంటికి చేరుకుని లిఫ్ట్ ఎక్కే సమయంలో ఆకతాయి కూడా అందులో దూరాడు తనతో శృంగారంలో పాల్గొనాలని లిఫ్ట్ లో బెదిరించాడు. అందుకు యువతి తిరస్కరించడంతో ఆమె జాకెట్‌ను చించేసి, దుస్తులను లాగి పడేశాడు. ఇక ఏం చేయాలో తోచక, చివరకు అతనితో అధరచుంబనానికి సిద్ధమేనని యువతి అంగీకరించింది. ఆమె సై అనడం మహదానందంగా ముద్దుకు సిద్ధమైన యువకుడి నాలుకను గబుక్కున పంటితో పట్టుకుని కొరికిపడేసింది. నాలుక తెగి రక్తం కారుతున్నయువకుడు భయపడి అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఆ వెంటనే యువతి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది. వారొచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి నాలుక ముక్కను స్వాధీనం చేసుకుని, తెగిన నాలుకతో ఆస్పత్రికి ఎవరైనా వస్తే వెంటనే తమకు తెలియపరచాలని సమీపంలోని ఆస్పత్రులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఓ ఆస్పత్రికి వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఘటనా స్థలంలో దొరికిన నాలుక, రక్తంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించి అతడే నిందితుడని నిర్ధారించి అత్యాచారం నేరంపై అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక ఆ యువతి చాక చక్యానికి జనం అభినందనలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి:బాహుబలి కలెక్షన్స్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:బన్నీ నా పాలిట దేవుడు(వీడియో)

English summary

A Girl aged 19 years in France was going to her house in France and a rapist tried to rape her in lift and tear off her clothes and then she accepted to kiss him and bites the rapist tongue and cuts it off. Later she had given complaint in police station police arrested him and put him in jail.