గాలిని ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు..!

Fresh Air Packed And Selling in China

07:09 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Fresh Air Packed And Selling in China

ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యమే. నీరు.. భూమి.. గాలి ఇలా ప్రతీదీ కలుషితమైపోయింది. ఇక వాతావరణ కాలుష్యం అయితే తీవ్రస్థాయికి చేరింది. అయితే ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోడానికి కెనడాకు చెందిన వైటాలిటీ ఎయిర్ అనే కంపెనీ సిద్ధమైంది. తమ దేశంలో పర్వతప్రాంత నగరమైన బాన్ఫ్ నుంచి తాజా గాలిని సేకరించి, దాన్ని క్యాన్లలో బంధించి చైనాకు ఎగుమతి చేస్తోంది. తొలి బ్యాచ్‌లో 500 క్యాన్లు చైనా పంపగా, అవన్నీ రెండు వారాల్లోనే అమ్ముడైపోయాయి. ఈ గాలి క్యాన్లు భారీగా పంపాలంటూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఈ గాలి క్యాన్ల ధర ఎంతో తెలుసా.. సైజును బట్టి రూ. 935 నుంచి రూ. 1,337 వరకు ఉంది. ఉత్తర చైనాలో కలుషితమైన పొగమంచు చాలా ఎక్కువ. దీనివల్ల ఒక్కోసారి గాలి ఆడదు. ఇక్కడ చలికాలంలో పవర్ ప్లాంట్లలోను, ఇళ్లలోను వెచ్చదనం కోసం బొగ్గు మండిస్తారు. దీనివల్ల వచ్చే పొగ, బయట ఉండే మంచు కలిసి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. పొగమంచు కారణంగా గతవారం బీజింగ్ లో తొలిసారి రెడ్ ఎలర్ట్ ప్రకటించి, స్కూళ్లకు సెలవులు ఇచ్చేసింది అక్కడి ప్రభుత్వం. గత ఏడాది తాను ఈబేలో జిప్‌లాక్ చేసిన బ్యాగులో గాలిని అమ్మడం చూశానని, వాళ్లు దాని ధరను 99 సెంట్లుగా పెట్టారని.. అప్పుడే తనకు కూడా గాలిని ఎందుకు ఎగుమతి చేయకూడదన్న ఆలోచన వచ్చిందని వైటాలిటీ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు మోజెస్ లామ్ చెప్పారు. తాము అమ్మేదే తాజా గాలి అయినప్పుడు.. దాన్ని ప్యాకింగ్ చేయడానికి మిషన్లు వాడితే ఆయిల్, గ్రీజు అంటుకుంటాయి కాబట్టి చేతులతోనే ప్యాక్ చేస్తున్నామని, అందుకే దీనికి ఎక్కువ సమయం పడుతోందని చెపుతున్నాడు. ముందుగా గాలిని సేకరించి, అందులోంచి ప్రమాదకరమైన కణాలను తీసేయాల్సి ఉంటుందని చెప్పాడు. త్వరలోనే తమ ఉత్పత్తులను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పాడు.

English summary

Canadian Fresh Air was selling in beijing , china.Two entrepreneurs from Alberta have been selling Vitality Air from a year, but over the last two weeks their sales to China have increased dramatically