ఆ ప్యాలెస్ లో ఫ్రెండ్లీ దెయ్యాలున్నాయట

Friendly Ghosts in a palace

11:28 AM ON 7th January, 2017 By Mirchi Vilas

Friendly Ghosts in a palace

అసలు దెయ్యాలున్నాయా లేదా అనే దానిపైనే రచ్చ నడుస్తుంటే, దెయ్యాల్లో ఫ్రెండ్లీ దెయ్యాలున్నాయంటున్నారు. అవును, ఈ విషయాన్ని వెల్లడించింది ఏ భూత వైద్యుడో.. మాంత్రికుడో కాదు. స్వయానా రాణి గారే చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎక్కడంటే, స్వీడన్ లోని ఓ రాజభవనంలో ఇలాంటి దెయ్యాలున్నాయట.

పూర్తివివరాల్లోకి వెళ్తే, స్వీడన్ రాయల్ కుటుంబానికి స్టాక్ హోంలోని లవన్ ఐలాండ్ లో డ్రాటింగ్ హోమ్ ప్యాలెస్ ఉంది. 17వ శతాబ్దంలో అత్యద్భుతంగా నిర్మించిన ఈ రాజభవనాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. ఇందులోనే ప్రస్తుతం స్వీడన్ రాజు 16వ కార్ల్ గుస్తాఫ్ కుటుంబం నివాసముంటోంది. అయితే తాజాగా రాణి సిల్వియా తమ నివాసం గురించి చెబుతూ.. మా ప్యాలెస్ లో దెయ్యాలు.. భూతాలు సంచరిస్తున్నాయి. కానీ.. వాటి వల్ల నాకేం భయం లేదు. ఎందుకంటే అవి చాలా ఫ్రెండ్లీ దెయ్యాలు. వాటి వల్ల కొన్నిసార్లు నాకు ఒంటరి తనం కూడా దూరమవుతోంది. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వివరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇది కూడా చూడండి: ఇవి తింటే అన్నిరకాలుగా పుష్టిగా ఉంటారట

ఇది కూడా చూడండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

English summary

We know few things about ghosts but recently in Sweeden friendly ghosts are there and the people living with them are saying, In fact are very happy to live together.