బర్త్ డే పార్టీ అని పిలిచి రేప్ చేసారు

Friends gang rape in Bangalore

04:57 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Friends gang rape in Bangalore

ఆడవాళ్ళ పై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగుళూరులో మరో అత్యాచారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పుట్టిన రోజు వేడుకని పిలిచి ముగ్గురు వ్యక్తులు ఓ 26 ఏళ్ల మహిళ పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో ఈ నెల(మే) 15న చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మంగళవారం సాయంత్రం ముగ్గురుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ 26 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది. బాబు అనే వ్యక్తి తన పుట్టిన రోజు పార్టీకంటూ ఆమెను ఆహ్వానించాడు.

దీంతో ఆమె పార్టీకి వెళ్లగా అతడు భుక్తియార్, ఖలీద్ అనే మరో ఇద్దరు స్నేహితులతో కలసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మరుసటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

English summary

Friends gang rape in Bangalore