20 నుంచి 28 వరకూ విజయవాడకు రైళ్లు బంద్(లిస్ట్)

From 20 to 28 trains bandh to Vijayawada

04:44 PM ON 20th September, 2016 By Mirchi Vilas

From 20 to 28 trains bandh to Vijayawada

ఏపీ రాజధానికి సమీపంలో వున్న ఏపీలోనే అతి పెద్ద జంక్షన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్ లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్(ఆర్ఆర్ఐ) పనులు కారణంగా బుధవారం(20) నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్ బ్లాక్ ను తీసుకుంటున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటే ఈ స్టేషన్ 8 రోజుల పాటు బోసిపోనుంది. పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. దీన్ని ప్రయాణికులు గమనించి, సహకరించాలని, సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు కోరారు. ఆయన తెల్పిన వివరాల ప్రకారం ఇలా వున్నాయి...

1. పూర్తిగా రద్దయ్యే రైళ్లు...
ఈ నెల 22, 23, 24 తేదీల్లో, నెంబర్ 17239/17240 గుంటూరు - విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దుచేశారు.

2. ఈనెల 23న 17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైళ్లని రద్దు చేసారు.

3. కొండవీడు ఎక్స్ ప్రెస్ రద్దు...
అలాగే ఈ నెల 23న, 17211 మచిలీపట్నం - యశ్వంతపూర్ కొండవీడు ఎక్స్ ప్రెస్, అదేవిధంగా 24న నెంబర్ 17212 యశ్వంతపూర్ - మచిలీపట్నం కొండవీడు ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు.

4. సర్కారు ఎక్స్ ప్రెస్ రద్దు
17644 కాకినాడపోర్టు - చెన్నై ఎగ్ మోర్ - కాకినాడ సర్కారు ఎక్స్ ప్రెస్ రైల్ ఈ నెల 23న రద్దు చేశారు.

5. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు...
నెంబర్ 12077/12088 చెన్నై సెంట్రల్ - విజయవాడ - చెన్నై సెంట్రల్ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ 21 నుంచి 26 వరకు గుంటూరులోనే నిలిపేసి ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు.

6. అమరావతి, హుబ్లీ ఎక్స్ ప్రెస్..
17226 హుబ్లీ-విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ 21, 22, 23, 17225 విజయవాడ-హుబ్లీ ఎక్స్ ప్రెస్ 22, 23 తేదీల్లో గుంటూరులో నిలిపేసి ఇక్కడి నుంచే పంపిస్తారు.

7. ఉద్యోగుల రైలు...
12796/12795 సికింద్రాబాద్-విజయవాడ- సికింద్రాబాద్ ఉద్యోగుల రైలు 21, 22, 23, 24 తేదీల్లో గుంటూరులో నిలిపేసి ఇక్కడ నుంచే తిరిగి నడుపుతారు.

8. ధర్మవరం - విజయవాడ...
17216 ధర్మవరం - విజయవాడ రైలును 20, 22 తేదీల్లో, 17215 విజయవాడ - ధర్మవరం రైలును 21, 24 తేదీల్లో గుంటూరు నుంచి నడుపుతారు.

9. గుంటూరు డివిజన్ రైళ్ల మళ్లింపు...
నెంబర్ 16032 జమ్ముతావి - చెన్నై సెంట్రల్ రైలుని 20న కాచీగూడ మార్గంలో నడుపుతారు.

10. ఇంటర్ సిటీ...
12706/12705 సికింద్రాబాద్ - గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లని 21 నుంచి 26 వరకు నడికుడి మార్గంలో నడుపుతారు.

11. లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలు...
17221 కాకినాడపోర్టు-లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలు 21, 24న రాజమండ్రి నుంచి గుణదల, వరంగల్, కాజీపేట మార్గంలోకి మళ్లిస్తారు.

12. జన్మభూమి ఎక్స్ ప్రెస్..
12805/12806 విశాఖ- సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు 22, 23 తేదీల్లో గుణదల నుంచి కాజీపేట మార్గంలోకి మళ్లిస్తారు.

13. బెంగుళూరు - భువనేశ్వర్..
18464 బెంగళూరు సిటీ జంక్షన్ - భువనేశ్వర్ రైలును డోన్ నుంచి కాచీగూడ, కాజీపేట, గుణదల, రాజమండ్రి మార్గంలో నడుపుతారు.

14. లోకమాన్య - కాకినాడ...
17222 లోకమాన్య తిలక్ టెర్మినస్ - కాకినాడ పోర్టు రైలు 22, 25 తేదీల్లో కాజీపేట మార్గంలో మళ్లిస్తారు.

15. నరసాపూర్ - నాగర్ సోల్...
17231 నరసాపూర్ - నాగర్ సోల్ రైలును 23న కాజీపేట మార్గంలో మళ్లిస్తారు. 18463 భువనేశ్వర్ - బెంగళూరు సిటీ ఎక్స్ ప్రెస్ రైలు 23న కాజీపేట మార్గంలో మళ్లిస్తారు.

16. కాకినాడ టౌన్ - భావనగర్..
17204 కాకినాడ టౌన్ - భావనగర్ ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 22న రాజమండ్రి - గుణదల మార్గంలో కాజీపేట మీదగా మళ్లిస్తారు.

17. రైళ్ల మళ్లింపు - గుంటూరు మీదగా
నెంబర్ 17406 ఆదిలాబాద్ - తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు 20 నుంచి 25 వరకు, నెంబర్ 17405 తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలును 21 నుంచి 26 వరకు నడికుడి మార్గంలో గుంటూరు మీదగా నడుపుతారు.

18. సింహపురి ఎక్స్ ప్రెస్...
12710 సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్ ప్రెస్ రైలును 21, 22 తేదీల్లో నడికుడి మార్గంలో గుంటూరు మీదగా నడుపుతారు.

19. పద్మావతి ఎక్స్ ప్రెస్...
12764 సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ ను 22, 23, 25 తేదీల్లో, అలాగే 12763 తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ ప్రెస్ ని 23, 24, 26 తేదీల్లో తెనాలి, గుంటూరు, నడికుడి మీదగా సికింద్రాబాద్ కు నడుపుతారు.

20. నాలుగు రైళ్ల రీషెడ్యూల్...
నెంబర్ 22831 హౌరా జంక్షన్-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం ఎక్స్ ప్రెస్ 21న మధ్యాహ్నం 3.35 గంటలకు బదులు రాత్రి 7.30 గంటలకు బయలుదేరుతుంది.

21. చెన్నై సెంట్రల్-జమ్ముతావి ఎక్స్ ప్రెస్...
16031 చెన్నై సెంట్రల్-జమ్ముతావి ఎక్స్ ప్రెస్ 22న వేకువజామున 5.15 గంటలకు బదులు ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది.

22. హౌరా జంక్షన్-వాస్కోడగామా...
18047 హౌరా జంక్షన్-వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ రైలు 22వ తేదీన రాత్రి 11.30 గంటలకు బదులు 23న ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది.

23. ప్రశాంతి నిలయం - హౌరా జంక్షన్...
22832 శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా జంక్షన్ ఎక్స్ ప్రెస్ రైలు 23న ఉదయం 7.40 గంటలకు బదులు ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది.

24. రద్దయిన ప్యాసింజర్ రైళ్లు...
22 నుంచి 28 వరకు నెంబర్ 77221 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, 21 నుంచి 28 వరకు 57318 మాచర్ల-బీమవరం జంక్షన ప్యాసింజర్, 77230 గుంటూరు - విజయవాడ ప్యాసింజర్, 57382 నరసాపూర్-గుంటూరు ప్యాసింజర్, 67273 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, 67274 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్, 57316 నరసాపూర్-గుంటూరు ప్యాసింజర్, ఈ నెల 21 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు, 77283 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్, 77284 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, 77289 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్, నెంబర్ 57381 గుంటూరు-నరసాపూర్ ప్యాసింజర్ రైలు 20 నుంచి 27 వరకు రద్దు చేశారు.

25. పాక్షికంగా రద్దయిన రైళ్లు..
నెంబర్ 56503 బెంగళూరు కంటోన్మెంట్ - విజయవాడ ప్యాసింజర్ రైలును 21 నుంచి 28 వరకు గుంటూరు వరకే నడుపుతారు. 56501 విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్ రైలు 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి వెళుతుంది. 56502 హుబ్లీ - విజయవాడ రైలు 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి నడుపుతారు. 56504 విజయవాడ -బెంగళూరు కంటోన్మెంట్ రైలును 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి నడుపుతారు.

English summary

From 20 to 28 trains bandh to Vijayawada