ఇకపై థియేటర్లలో 'జాతీయ గీతం'.. ప్రతీ ఒక్కరు లేచి నిలబడాల్సిందే!

From now onwards National Anthem in movie theatres

11:18 AM ON 1st December, 2016 By Mirchi Vilas

From now onwards National Anthem in movie theatres

భారతదేశ జాతీయ గీతాన్ని అగౌరవ పరిచే దుస్థితి అక్కడక్కడా వస్తోంది. కనీసం దీని గురించి పట్టించుకునే వాడే కరువయ్యాడు. కొన్నిసార్లు మితిమీరి ఘటనలు ఉంటున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని సినిమా హాళ్ళలోనూ మూవీ ప్రదర్శనకు ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ సమయంలో తెరపై జాతీయ పతాకాన్ని చూపాలని, సంక్షిప్త రూపాన్ని కాకుండా పూర్తిగా చూపడమే గాక, జాతీయ గీతాలాపనలో ఎలాంటి నాటకీయతలకు చోటు లేకుండా చూడాలని సూచించింది. కాగా ఇప్పటికే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ నిబంధనను కచ్చితంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే.

1/3 Pages

జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడాలని కోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, పతాకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భోపాల్ కు చెందిన సామాజిక కార్యకర్త శ్యాం నారాయణ్ చౌస్కీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది.

English summary

From now onwards National Anthem in movie theatres