అందంగా కనిపించడం కోసం ...

Fruits make you look beautiful

04:50 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Fruits make you look beautiful

అందంగా కనిపించాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో డబ్బు ఖర్చు చేసి సౌందర్యసాధనాలను కొనుగోలు చేయడం, వాటిని వాడి అలర్జీలకి గురవుతూ ఉంటారు. ఏదో ఫేస్‌ప్యాక్‌లు, క్రీన్‌అప్‌లు చేస్తూ అనవసరంగా డబ్బుని వృధా చేస్తుంటారు. ఇలా చేస్తేనే అందంగా ఉంటారు అనుకుంటే పొరపాటే. రోజూ సరైన ఆహారం తీసుకోవడం వల్ల సహజ సౌందర్యం చేకూరుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన పండ్లు తినడం వల్ల అందంగా, కాంతి వంతంగా తయారవుతారు. మీ చర్మం మృదువుగా తయారవుతుంది. అందంగా కనపడాలంటే ఈ కింది పండ్లను తినడం చాలా ముఖ్యం.

1/8 Pages

1. రాస్‌బెర్రీస్‌

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్‌ సి మరియు ఫైబర్‌ ఉన్నాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మీ వయస్సును తగ్గించి యవ్వనంగా కనపడేందుకు దోహదపడుతుంది. రాస్‌బెర్రీస్‌ వల్ల కొంచెం ఎక్కువ తాజా దనాన్ని మీరు పొందుతారు. దీనిలోని సి విటమిన్‌ చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని నిగారించడానికి సహాయపడుతుంది. రోజూ ఈ రాస్‌బెర్రీస్‌ తినడం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు మీరు అందంగా తయారవుతారు. ఇది అందానికే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.

English summary

Believe it or not, there are some fruits that can make you look beautiful and younger.