ఈరోజు పున్నమి చంద్రుని స్పెషాలిటీ ఇదే! కచ్చితంగా చూడండి..

Full moon day

01:10 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Full moon day

పౌర్ణమి చంద్రుడు చూడముచ్చటగానే ఉంటాడు. అయితే మిగిలిన పున్నములకు ఈసారి ఆశ్వయుజ మాస పున్నమికి ఎంతో తేడా వుంది. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు అక్టోబర్ 16 ఆదివారం ప్రత్యేకత ఏంటో బాగానే గుర్తుంటుంది. చంద్రుడి పున్నమి కాంతులు వెదజల్లే అద్భుతమైన ఘటన ఇది. అంతేకాదు చంద్రుడు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు కూడా... ప్రతి నెలా పున్నమి రోజున కనిపించే దానికంటే పెద్దగా చంద్రుడు కనిపిస్తాడు. ఇంత ప్రత్యేకతున్న ఈ పున్నమిని శరత్ పున్నమి అంటారు. శరదృతువులో వచ్చే పున్నమి అంటే కవులకు ఎంతగానో ఇష్టం. తెలుగు సాహిత్యంలో శరత్ పున్నమికి ప్రత్యేక స్థానముంది. ఎన్నో వర్ణనలు కావ్యాలు పుట్టుకొచ్చాయి. అందుకే కోట్లమంది వీక్షించారు.

అంతేకాక ఈ పున్నమికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్ గా దర్శనమివ్వనుంది. ఆకాశంలో చాలా అరుదుగా ఈ దృశ్యం కనిపిస్తుంది. అంటే ఈ రోజు చంద్రుడు ఎరుపు రంగులో చాలా పెద్దగా కనిపిస్తాడన్నమాట. చంద్రుడు తన కక్ష్య నుంచి భూమికి దగ్గరగా రావడం వల్ల ఇలా కనిపిస్తాడు. సూర్యకాంతి చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కంటికి కనిపిస్తాడు. అందుకే శాస్త్రవేత్తలు దీనిని బ్లడ్ మూన్ అంటారు. గతేడాది సెప్టెంబర్ లోనూ ఇలాగే చంద్రుడు కనువిందు చేశాడు. ఇప్పుడు ఈ ఏడాది మరోసారి చంద్రుడు కనువిందు చేయడంతో చాలామంది పరవశించారు.

English summary

Full moon day