అభిమన్యుడుని చంపడానికి రచించిన పద్మవ్యూహానికి సంబంధించి పూర్తి ప్లాన్ ఇదే!

Full plan of Padmavyuham

11:47 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Full plan of Padmavyuham

యుద్ధం అంటే మనకు గుర్తుచ్చేది మహా భారత యుద్ధం. యుద్ధ కురుక్షేత్ర సంగ్రామం. ఇందులో ఎన్నో యుద్ధ తంత్రాలు, వ్యూహాలు వున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది పద్మవ్యూహం. మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఇది ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలలో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి ఏమాత్రం వీలులేకుండా దుర్భేధ్యంగా ఉంటుంది. వాస్తవానికి ఈ చక్రవ్యూహాన్ని కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నుతారు. ముఖ్యంగా అర్జునుడు లేని సమయం చూసి మరీ పాండవులను హతమార్చడానికి ఈ వ్యూహం పన్నారు.

అయితే అందులో అభిమన్యుడు చిక్కుకొని, వీరోచితంగా పోరాడినా చివరకు ప్రాణాలు కోల్పోతాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం యొక్క పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైన్యం ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో శ్రీకృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి(శ్రీకృష్ణుని కొడుకు), అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు.

ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వలన వేరే గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను కురుక్షేత్రంలో ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి బలవుతాడు.

1/10 Pages

ఏడు వలయాలుగా..


పద్మవ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో ఇలా నిర్మితమై, ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుంది.

English summary

Full plan of Padmavyuham