పిచాయ్ తో విద్యార్ధుల పిచ్చాపాటి

Funny Incident In Sundar Pichai India Tour

12:22 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Funny Incident In Sundar Pichai India Tour

భవిష్యత్తులో అవకాయ్ లాంటి పేర్లు కూడా ఆండ్రాయిడ్ కు రావచ్చేమో .... ఎందుకంటే గూగుల్ సిఈఓ సరదా మాటలను బట్టి అంచనా వేయాల్సి వస్తోంది.

ప్రముఖ గూగుల్ సంస్థ సిఈఓ సుందర పిచాయ్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ లోని కామర్స్ విద్యార్ధులతో ముచ్చట్టించిన సమయం లో ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది. కొందరు విద్యార్ధులు అడిగిన ప్రశ్నకు పిచాయ్ తడబడ్డాడు . "గూగుల్ సంస్థ వారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వెర్షన్లకు అన్నింటికి డోనట్, ఎక్లేర్ జింజర్ బ్రెడ్, ఐస్ క్రీం సాండ్విచ్,జెల్లీ బీన్ ,కిట్కాట్,లాలిపాప్ వంటి విదేశీ వంటకాల పేర్లను పెడుతున్నారు , ఆండ్రాయిడ్ కి భారతీయ వంటకం పేరు పెట్టచ్చు కదా" అని విద్యార్దులు అడగడం తో మొదట పిచాయ్ తడబడి ఆ తర్వాత " ఈ విషయం పై మా అమ్మను అడిగి చెప్తాను " అని సమాధానమిచ్చాడు . ఆండ్రాయిడ్ తర్వాతి వెర్షన్ పేర్లకు ఆన్లైన్ లో ఒక పోల్ అవకాశం ఉందని చెప్పాడు. కాని విద్యార్దులు మాత్రం తర్వాతి ఆండ్రాయిడ్ వెర్షన్ కు " పెడా , నెయ్యప్పమ్, నాంఖటాయ్ " వంటి పేర్లను సూచించి పిచాయ్ ను నవ్వులతో ముంచేత్తారు.

English summary

Google CEO Sundar Pichai recently visited in India . During that visit one funny incident took place while he was talking to some commerce students some of the students suggested pichai to put indian reciepe name to next android version