పెళ్లిలో పిచ్చి పీక్స్‌!

Funny photographer in wedding

10:41 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Funny photographer in wedding

ఒకప్పుడు పెళ్ళిలో ఫోటోలు తియ్యడం, వీడియోలు తియ్యడమంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అది ఒక మరపురాని గుర్తులుగా భావించేవారు. అయితే ఇప్పుడు సెల్‌ కెమేరాలు, డిజిటల్‌ కెమేరాలు వచ్చాక ఫోటోలు ఒక అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు అంటూ హోరెత్తిస్తున్నారు. పెళ్ళిలో కూడా పిచ్చిపిచ్చిగా పోజులిచ్చి ఫోటోలు దిగుతున్నారు. తాజాగా ఇలాగే ఒక పెళ్ళిలో ఒక స్టూడియో కెమేరామెన్‌ ఒక వింత భంగిమలో ఫోటో తియ్యాలనుకున్నాడు. అందుకోసం నూతన వధూవరులను ఎదురెదురుగా కొంచెం దూరంగా నిలబెట్టి ఒకరి చెయ్యి ఒకరిని పట్టుకోమన్నాడు. ఆ తరువాత కింద నుంచి వారిద్దరి మధ్యలో నిలువుగా పడుకుని ఒక ఫోటో తీశాడు.

ఈ ఫోటో ప్రస్తుతం మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ ఫోటోని చూసిన హీరో నిఖిల్‌ పిచ్చి పీక్స్‌ కి వెళ్ళింది అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి నవ్వుకున్నాడు. దీనిని చూసిన రానా దగ్గుబాటి హ్హహ్హహ్హ... అంటూ నవ్వుతూ రీ-ట్వీట్‌ చేశాడు.

English summary

A Funny photographer taking a new couple photo in wedding.