వర్ధమాన సినీనటుడు బాల ప్రశాంత్‌ మృతి

Future hero Bala Prasanth Dead

06:30 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Future hero Bala Prasanth Dead

వర్ధమాన సినీనటుడు మరియు సినిమా కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న బాల ప్రశాంత్‌ శుక్రవారం హైదరాబాద్‌ లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బాల ప్రశాంత్‌ "ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు" అనే కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నాడని, ఇంతకు ముందు కొరియోగ్రాఫర్‌గా పని చేసేవాడని, హీరోగా ఛాన్స్‌ వచ్చిందని చెప్పారు. బాల ప్రశాంత్‌ హైదరాబాద్‌ లో కూకట్‌పల్లిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఆరవ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అక్కడ నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ మృతి పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Future hero Bala Prasanth Died. Future actor Bala Prasanth died in hyderabad.