అవకాశం ఇస్తానంటే ఫార్మ్ హౌస్ కి వెళ్ళా!

Future heroine went to farm house for chance

01:06 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Future heroine went to farm house for chance

సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం చిన్న హీరోయిన్స్ కు అవకాశాలు అక్రమ మార్గంలోనే వస్తాయి అనే విషయాన్ని ఒప్పుకోక తప్పని నిజం. హీరోయిన్ కావాలనే వాళ్ళ బలహీనతను నిర్మాతలు దర్శకులు వినియోగించుకుని, ఆ అమ్మాయిలను వారు వాడుకుని అవకాశాలు ఇవ్వడం మనం గతంలో చాలా సార్లు చూశాం. అయితే సినీ పరిశ్రమలో ప్రతీ వారు ఇలా ఉండరు, కొందరు దర్శక-నిర్మాతలు మాత్రమే ఈ కోవకు చెందుతారు. ఇక తాజాగా ఒక వర్ధమాన హీరోయిన్ తనకు జరిగిన ఇలాంటి పరిస్థితిని మీడియా ముందు వివరించింది. మోడలింగ్ లో రాణించిన తాను హీరోయిన్ అవ్వడం కోసం ఫిల్మ్ నగర్ చేరుకుంది.

అవకాశాల కోసం చాలా చోట్ల తిరిగింది. చిన్న చిన్న ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఒక దర్శకుడు అవకాశం ఇస్తా ఫార్మ్ హౌస్ కు వస్తావా అంటే, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తాను అందుకు ఓకే చెప్పింది. ఆ దర్శకుడు ఇచ్చిన మాట ప్రకారం తనకు అతని సినిమాలో ఒక హీరోయిన్ గా అవకాశం కూడా ఇచ్చాడు. ఎన్నో అవాంతరాల మద్య విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మళ్లీ తాను అవకాశాల కోసం వెదికే పనిలో ఉన్నాను అని, ఈసారి మరే దర్శకుడు లేదా నిర్మాత ఫాం హౌస్ కు రమ్మంటారో అని భయంగా ఉందని ఈ వర్దమాన నటి చెప్పుకొచ్చింది.

English summary

Future heroine went to farm house for chance