ఎన్టీఆర్‌ హీరోయిన్‌కి పెళ్లైపోతుంది

Gajala To Marry Faisal Raza Khan

05:59 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Gajala To Marry Faisal Raza Khan

2001 లో విడుదలైన 'నాలోఉన్న ప్రేమ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ గజాలా. ఆ తరువాత కలుసుకోవాలని, అల్లరి రాముడు, స్టూడెంట్‌ నెం.1, తొట్టిగ్యాంగ్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే ఈ అమ్మడు 2011 లో నటించిన 'మనీ మనీ మోర్‌ మనీ' చిత్రం తరువాత తెరపై కనుమరుగైంది. అప్పటి నుండి మళ్లీ ఈ అమ్మడు మరే చిత్రంలో నటించలేదు. అయితే ఇప్పుడు గజాలా మళ్లీ ప్రత్యక్షమయింది. గజాలా బాలీవుడ్‌ సీరియల్‌ నటుడు ఫైసల్‌ రాజాని వివాహం చేసుకోబోతుంది. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 24న అంగరంగ వైభవంగా జరగబోతుంది. అయితే ఈ జంట వారికి బాగా సన్నిహితులైన వారిని తప్ప మరెవరిని వారి పెళ్లికి పిలవడంలేదు. అయితే పెళ్లైపోయాక వీరు గ్రాండ్‌ గా రిసెస్షన్‌ ని ఏర్పాటు చేయబోతున్నారట. అక్కడకి బాలీవుడ్‌ ప్రముఖుల్ని పిలవబోతున్నట్లు సమాచారం.

English summary

Gajala who was acted in Super Hit Films Like Student No.1,Thotti Gang,Janaki Weds Sriram was become star heroine at one time in Telugu Film industry.Now she was going to marry bollywood serial actor Faisal Raza Khan on February 24th.