గాలివారి అమ్మాయి పెళ్లి ఖర్చు తెలిస్తే షాకౌతారు!

Gali daughter marriage cost

12:00 PM ON 9th November, 2016 By Mirchi Vilas

Gali daughter marriage cost

ఓబుళాపురం గనుల యవ్వారంలో మైనింగ్ రారాజుగా.. మైనింగ్ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరున్న గాలి జనార్దనరెడ్డి గురించి అందరికీ తెల్సిందే. ఎందుకంటే ఆమధ్య జైలుకెళ్లినా ఈ మధ్య తన కుమార్తె పెళ్లి సందర్భంగా ఆయన తయారు చేయించిన పెళ్లి శుభలేఖ అందరి దృష్టిని ఆకట్టుకోవడంతో పాటు సంచలనంగా మారింది. శుభలేఖను ఒక ఖరీదైన బాక్స్ లో ఎల్ సీడీని ఏర్పాటు చేసి.. పాట రూపంలో పెళ్లి ఆహ్వానాన్ని పిలవటం వెరైటీగా ఉండటమే కాదు.. దేశ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. పెండ్లి పిలుపు కోసం ప్రత్యేకంగా ఒక పాటను కంపోజ్ చేసి మరీ శుభలేఖగా తయారు చేసిన ఐడియాతో.. గాలి వారింట పెళ్లి సందడి మరెన్ని విశేషాలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచార తీవ్రత పెరిగిపోయి, చివరకు ఐటీ శాఖాధికారులు దృష్టి సారించే వరకూ వెళ్లింది.

1/4 Pages

దీంతో.. పెళ్లి సందడి తర్వాత కొత్త కేసులు చుట్టుకుంటాయన్న ఆలోచనతో గాలి పరివారారినికి చెందిన శ్రీరాములు మీడియా ముందుకు వచ్చి.. తాము మధ్య తరగతికి చెందిన వారిమేనని.. సగటు మధ్యతరగతి ఇళ్లల్లో ఎలా అయితే పెళ్లి వేడుక జరుగుతుందో అదే రీతిలో జరుగుతుందని తనదైన శైలిలో చెప్పుకొచ్చి, చాలామందికి షాకిచ్చారు. అయితే.. ఇలాంటి మాటలన్ని ఎవరికోసమో తెలిసిన వారంతా చిద్విలాసంగా నవ్వుకునే పరిస్థితి.

English summary

Gali daughter marriage cost