గాలి కూతురు బ్రహ్మణి పెళ్లి చీర ఖరీదు తెలిస్తే ఎంతటి కోటీశ్వరుడుకైనా మతి పోవాల్సిందే!

Gali daughter's marriage saree cost was 19 crores

12:02 PM ON 16th November, 2016 By Mirchi Vilas

Gali daughter's marriage saree cost was 19 crores

రాజు తలచుకుంటే... అన్న చందంగా బళ్లారి మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి కూతురి పెళ్లి ఈరోజు బెంగళూరు ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. నోట్ల రద్దు నిర్ణయంతో అందరిపై ప్రభావం పడినా, గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లిపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం. వెడ్డింగ్ కార్డుతోనే అందరి దృష్టిని ఆకర్షించిన గాలి, తన కూతురి పెళ్లికి భారీగా ఖర్చుపెడుతున్నారు. దాదాపు 5వందల కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. సినిమా సెట్టింగ్ లను తలదన్నేలా ఏర్పాట్లు జరిగాయి. గాలి జనార్థనరెడ్డి, శ్రీరాములు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కన్నడ ఛానల్ లో ఈ పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

1/4 Pages

పెళ్లి శుభలేఖతోనే అందరినీ అవాక్కయ్యేలా చేసిన గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లిలో ప్రతీ ఘట్టాన్ని అత్యంత ఘనంగా చేయాలనుకుంటున్నారట. గాలి జనార్థనరెడ్డి కూతురు బ్రహ్మణి పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో ఆమె కట్టుకునే చీర దగ్గర్నుంచి పెట్టుకునే ఆభరణాల దాకా అన్నీ అతి ఖరీదైనవే కావడం విశేషం.

English summary

Gali daughter's marriage saree cost was 19 crores