గాలి కూతురు పెళ్లికోసం అతిధులకు చేస్తున్న ఏర్పాట్లు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

Gali Janardhan Reddy daughter marriage

12:49 PM ON 25th October, 2016 By Mirchi Vilas

Gali Janardhan Reddy daughter marriage

డబ్బుండి తలచుకుంటే, కొండమీది కోతి దిగి వస్తుందనే సామెత వుంది కదా. ఇప్పుడు కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దనరెడ్డి కూతురి వివాహానికి చేస్తున్న ఏర్పాట్లు చూస్తే, వావ్ అనాల్సిందే. ఇప్పటికే శుభలేఖ నెట్ లో హల్ చల్ చూస్తే, దిమ్మతిరిగిపోతోంది. ఇక అత్యంత ఘనంగా వివాహం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నీ ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారని అంటున్నారు.. ఆయనకు కుమార్తె బ్రహ్మణి అంటే ఎంతో అమితమమైన ప్రేమట. దాదాపుగా అన్ని వ్యాపారాలకూ బ్రహ్మణి పేరు మీదే జరుగుతున్నాయట. ఏకైక కుమార్తె బ్రహ్మణి వివాహాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడితో గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 16వ తేదిన బెంగళూరు నగరంలోని ప్యాలెస్స్ గ్రౌండ్స్ లో అంగరంగవైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక రైళ్లు, బస్సులు, వందలాది ఖరీదైన కార్లు ఈ వేడుకోసం ఏర్పాటు చేసారట.. ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలనుంచి రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా రైళ్లు వేయిస్తున్నారట.. ప్రత్యేకంగా హెలికాఫ్టర్లు, విమానాలను వినియోగిస్తున్నారట.. ఇందుకోసం 10 హెలిప్యాడ్ లు కూడా సిద్ధం చేసినట్టు టాక్.

వివాహ వేడుకులకు వచ్చే అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నరట. ఇక పెళ్ళికి వచ్చే అతిధులకు మజా చేయడానికి తారల డాన్సులు కూడా పెడుతున్నారట. ఒక్కో స్టార్ కి ఇందుకోసం కోటి రూపాయల వరకూ వెచ్చిస్తున్నట్టు బోగట్టా.

English summary

Gali Janardhan Reddy daughter marriage