గాలి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేస్తే .... ప్లే అయ్యే వీడియో చూస్తే మతిపోద్ది

Gali Janardhan Reddy Daughter Marriage Wedding Card

11:35 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Gali Janardhan Reddy Daughter Marriage Wedding Card

బడాబాబుల ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా వుంటాయో అప్పుడప్పుడు చూపిస్తూ తమ సత్తా చాటుకుంటారు. తాజాగా కర్ణాటకలోని బళ్లారి మైనింగ్ సామ్రాజ్యంతో ఓ వెలుగువెలిగి, ఆతర్వాత అరెస్టై ప్రస్తుతం బెయిల్ పై బయటికొచ్చిన గాలి జనార్ధన రెడ్డి ఇప్పుడు మరో సంచలనానికి వేదికయ్యారు. ఆయన కూతురికి ఇటీవలే రాజీవ్ రెడ్డితో నిశ్చితార్థమైంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు హాజరయ్యారు. నిశ్చితార్థ వేడుక ఘనంగా చేసిన గాలి జనార్ధన్ రెడ్డి పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి చరిత్రలో నిలిచిపోయేలా కూతురి పెళ్లి చేయాలని గాలి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. తాజాగా గాలి కూతురి వెడ్డింగ్ కార్డ్ నెట్ లో వైరల్ గా మారింది. కూతురి పెళ్లి కార్డ్ ను ఓ బాక్స్ లో ఉంచిన గాలి జనార్ధన్ రెడ్డి బాక్స్ ఓపెన్ చేయగానే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్టే ఈ వీడియో. గాలి కూతురి వెడ్డింగ్ కార్డ్ లో ప్లే అవుతున్న పూర్తి వీడియో ఇదే. మీరు చూస్తే, నిజంగా మతి పోతుందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:అడ్డుకోవాల్సిన పోలీసులే బార్ గర్ల్స్ తో చిందులేశారు.. ఆపై ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి:భర్తేమో డ్రైవర్.. ఆమెకేమో లగ్జరీ కార్లు, ఇల్లు.. షాకైన పోలీసులు!

English summary

Gali Janardhan Redyy who was arrested in Mining case and at present he was released on bail and now he was going to do his daughter marriage grandly and the wedding card of his daughter was shocked everyone because when we open the wedding card box then a HD Super LED display will opens and plays a video by welcoming to the marriage.