రోజాపై  'ముద్దు' దాడి

Gali Muddu Krishnama Naidu Fires On Roja

04:14 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Gali Muddu Krishnama Naidu Fires On Roja

ఎపి సిఎమ్ చంద్రబాబు మీద , చినబాబు లోకేష్ మీదా సినీ నటి , వైసిపి ఎంఎల్ఎ రోజా చేసిన విమర్శల నేపధ్యంలో టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని చేసి రాజకీయ భిక్షపెట్టిన సీఎం చంద్రబాబుని విమర్శించే అర్హత ఎమ్మెల్యే రోజాకు ఎక్కడిదని దుయ్యబట్టారు. ఎంఏ చదువుకున్న చంద్రబాబు ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని అవహేళన చేయడం పదో తరగతి చదివిన రోజాకెక్కడదని అయన విరుచుకు పడ్డారు. రాజకీయాలంటే సినిమా డైలాగులు కాదని ఆయన చెబుతూ, కష్టపడి పని చేయాలని, ఓర్పు, నేర్పుతో అధికారులతో పనులు చేయించుకోవాలని హితవు పలికారు.

రాత్రింబవళ్లు కష్టపడి హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుడు, మైక్రోసాఫ్ట్‌ అధినేతల మెప్పు పొందిన సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత రోజా కు లేదన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించి చిత్తూరు జిల్లా పరువు, నగరి ప్రజల పరువు తీసిన రోజా తీరు అవమానకరమన్నారు. రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుంటే సీఎంను విమర్శించడం అవివేకమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇన్నాళ్లవుతున్నా ఒక్క పైసా నిధులు తెచ్చావా అని ఆయన రోజాను ప్రశ్నించారు.

English summary

Telugu Desam Party Leader Galo Muddu Krishnama Naidu fires on Ysrcp MLA Roja for commenting Nara Chandrababu Naidu and Nara Lokesh.Muddu Krishnama Naidu says that she had no right to comment on Nara Chandra Babu Naidu and Nara Lokesh.He says that she have to realize that Chandrababu had given MLA ticket two times.