ప్రధాని హామీకి విలువ లేదా?

Galla Jayadev Demands To Fulfill Commitments Made By BJP

12:08 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Galla Jayadev Demands To Fulfill Commitments Made By BJP

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా చేసిన ప్రకటన పై తెలుగు తమ్ముళ్ళు భగ్గు మంటున్నారు. ఈ ప్రకటన తమకు బాధ కలిగించిందని సూపర్ స్టార్ మహేష్ బాబు బావ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు . కేంద్రమంత్రి ప్రకటన...ఆనాడు సభలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి విలువ లేకుండా చేసిందన్నారు.14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్రమంత్రి..ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ, ఎన్టీయే నేతల మాటలతో మోసపోయామన్న భావన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కలుగుతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఉందని జయదేవ్ పేర్కొంటూ, ఇప్పుడు సాధ్యం కాదని ఆర్ధికశాఖ సహాయమంత్రి చెప్పడం సరికాదని అన్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ఏపీకి న్యాయం చేయాలని చేతులు జోడించి అడుగుతున్నానని జయదేవ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:ప్రత్యేక హోదాపై ఝలక్

ఇవి కూడా చదవండి:బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి హాసన్!

ఇవి కూడా చదవండి:అత్తారింటికి వెళ్తున్నపవర్ స్టార్

English summary

Guntur TDP MP Galla Jayadev Demanded Central Government to Full Fill Commitments made by BJP Government in Elections. He explained each and everything which Central Government gave to Andhra Pradesh. He also Demanded Special Status For Andhra Pradesh.