ప్రమాదం నుంచి బయటపడ్డ సూపర్ స్టార్ బావ

Galla Jayadev Escapes From Road Accident

10:53 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Galla Jayadev Escapes From Road Accident

రోడ్డు ప్రమాదంలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు బావ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అసలే తెలుగు రాష్ర్టాల్లో గత నాలుగు రోజులుగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో డ్రైవర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రెప్పాటులో ప్రమాదం జరిగిపోతోంది. తాజాగా ఈ రోజు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేష్ పెద్ద బావ అయిన గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో బయటపడ్డారు. జయదేవ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జయదేవ్ ఎంపీగా ఎన్నికయ్యాక ఆయన వాహనాలు యాక్సిడెంట్ కు గురవ్వడం ఇది మూడోసారి.

ఇవి కూడా చదవండి:పవన్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవరు?

జయదేవ్ శుక్రవారం గన్నవరం నుంచి గుంటూరు వెళుతుండగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి ఆయన ప్రయాణిస్తున్న కారు, ఆ పక్కనే ఉన్న ఇసుక గుట్టను ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి స్పీడ్ గా వచ్చిన మరో కారు కూడా ఢీ కొట్టడంతో జయదేవ్ కారు ఒక్కసారిగా ముందుకు వెళ్లింది. అయితే కారులో ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో జయదేవ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. జయదేవ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న వెంటనే పలువురు టీడీపీ నాయకులు - ప్రజాప్రతినిధులు ఆయనకు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. గతంలో ఆయన హైదరాబాద్ లో బైక్ నడుపుతూ కిందపడడడంతో ఆయన కాలుకు స్వల్పగాయాలయ్యాయి. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఆయన కాన్వాయ్ లో వాహనాలు వరుసగా ఢీకొనడంతో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ అప్పుడు కూడా జయదేవ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక తాజా ప్రమాదం నుంచి ఆయన మరోసారి సురక్షితంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:ఐస్ క్రీం వల్ల పెళ్లి ఆగిపోయింది

ఇవి కూడా చదవండి:చ ... చ ..13ఏళ్ల బాలికలకు కన్యత్వ పరీక్షలు చేసి మరీ ...

English summary

Guntur MP Galla JayaDev escapes from Car Accident in Guntur. His car dashed sand and another car hits bach Jaya Dev Car from back. He was admitted in Near By Hospital and he was taking treatment in the Hospital.