బిగ్ షాట్ వెంట వెళ్తున్న సూపర్ స్టార్ ....

Galla Jayadev To Celebrate His Birthday In Tokyo

09:45 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Galla Jayadev To Celebrate His Birthday In Tokyo

అసలే వ్యాపార రంగంలో ఆరితేరారు... ఇక పొలిటికల్ ఫీల్డ్ లోనూ బిగ్ షాటే .... అంతేకాదు సినీ రంగంలో సూపర్ స్టార్ కి అల్లుడు , మరో సూపర్ స్టార్ కి బావ ... తెల్సిపోయిందా ఎవరో ... ఇంకెవరు ... చిత్తూరు జిల్లా రాజకేయ కుటుంబానికి చెంది, అత్తింటి జిల్లా కు ఎంపిగా ఎన్నికైన వ్యాపార వేత్త గల్లా జయదేవ్.. సినీ రంగంలోనూ ఆయనకు మంచి పరిచయాలున్నఈయన సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కూతురు, మహేష్ బాబు సోదరి అయిన పద్మావతిని పెళ్లి చేసుకోవడంతో సినీ బంధం మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని బిగ్ షాట్స్ లో ఒకరైన గల్లా జయదేవ్ టిడిపి ఎంపి గా వున్నారు.ఆయన తల్లి గల్లా అరుణకుమారి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కొనాసాగి , చంద్రగిరి నుంచి రెండు సార్లు ఎంఎల్ఏ గా ఎన్నికై, 2004 -2014 మధ్యకాలంలో మంత్రిగా పని చేశారు. ఐతే గత ఎన్నికల్లో ఆమె టిడిపి లోకి జంప్ అయి కొడుకు జయదేవ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జయదేవ్ తన సొంత జిల్లా చిత్తూరును వదిలిపెట్టి.. గుంటూరులో ఎంపీగా పోటీ చేయించడంతో గెలుపు సాధించారు.

ఇక జయదేవ్ బర్త్ డే సెలబ్రేషన్స్ని భారీ స్థాయిలో చేసుకోడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అది కూడా జపాన్ రాజధాని టోక్యోలో. మరి ఈ సందడిని తిలకించడానికి రెండు కళ్ళు చాలవట. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వ్యాపార రంగాల్లోని తన సన్నిహితుల మధ్య భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని నిర్ణయించు కోవడంతో అంతా టోక్యో బాట పడుతున్నారు. జయదేవ్ కుటుంబ సభ్యులతో సహా 60 మంది సెలబ్రెటీలను తీసుకుని ఈ సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో టోక్యోకు బయల్దేరడానికి రంగం సిద్ధం చేసారట. సినీ పరిశ్రమ నుంచి తన బావమరిది మహేష్ బాబుతో పాటు రానా దగ్గుబాటి - సుధీర్ బాబు సహా కొందరు సెలబ్రెటీలు జయ దేవ్ వెంట టోక్యో వెళ్ళే బ్యాచ్ లో ఉన్నారట. ఈ నెల 29 వరకు గల్లా జయదేవ్ పుట్టిన రోజు వేడుకలు కొనసాగబోతున్నాయి.

గుర్రంపై బాలయ్య ....

రత్నాచల్ కి టెండర్

ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

English summary

Guntur MP and Businessman Galla Jayadev t o celebrate his birthday in Tokyo.He is going to celebrate his birthday with some of the politicians,Friends and some of the Tollywood celebrities like Super Srtar Mahesh Babu,Sudheer Babu,Rana Daggubati etc