సూపర్ స్టార్ బావ 'దూకుడు'

Galla Jayadev updates

10:16 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Galla Jayadev updates

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో ‘దూకుడు’ చూపిస్తుండగా, ఆయన బావ గల్లా జయదేవ్ చట్టసభ సభ్యుడిగా ‘దూకుడు’ చూపిస్తున్నారు. పార్లమెంటుకు ఎంపికవడం తొలిసారే అయినా సీనియర్ లీడర్లను మించిపోయేలా ఆయన అన్నిట్లో యాక్టివ్ గా ఉంటున్నారు. పార్లమెంటులో జరిగే చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పీఆరెస్ ఇండియా సర్వే ప్రకారం ఏపీ నుంచి లోక్ సభకు ఎంపికైన 25 మంది ఎంపీల్లో ముగ్గురు మాత్రం గత రెండేళ్లలో ఇంతవరకు నోరు విప్పలేదట. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు.

ఇకపోతే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇంతకు ముందు టెర్ములో రాష్ర్ట విభజన సమయంలో పార్లమెంటులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవారు. ఈసారి మాత్రం ఆయన ఇంతవరకు పెదవి విప్పలేదట. మిగతా వారంతా మాత్రం మాట్లాడారని సర్వేలో తేలింది. గల్లా జయదేవ్ ఈ విషయంలో అందరికంటే ముందున్నారట. ఆయన ఇంతవరకు పార్లమెంటులో 55 చర్చల్లో పాల్గొని టాప్ లో నిలిచారు. ఇక పార్లమెంటులో 86 శాతం అటెండెన్స్ ఉందట ఇక ఆ తరువాత స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు, మూడో స్థానంలో తోట నరసింహం ఉన్నారు.

రామ్మోహన్ 53 చర్చల్లో పాల్గొనగా తోట 41 చర్చల్లో పాల్గొన్నారు. వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి - కొత్తపల్లి గీతలు 40 చర్చల్లో పాల్గొని నాలుగో స్థానంలో ఉన్నారు. మరో వైసీపీ ఎంపీ వరప్రసాద్ 38 చర్చల్లో పాల్గొని అయిదో స్థానంలో ఉన్నారు. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నల విషయంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇంత వరకు 354 ప్రశ్నలు అడిగి, టాప్ లో నిలిచారు. గల్లా జయదేవ్ 234 ప్రశ్నలతో రెండో స్థానంలో... రామ్మోహన్ నాయుడు 217 ప్రశ్నలతో మూడో స్థానంలో ఉన్నారు. కాగా చర్చల్లో పాల్గొననని ఎస్పీవై రెడ్డి కనీసం ఈ రెండేళ్లో ఒక్క ప్రశ్న కూడా అడిగిన పాపాన పోలేదట.

English summary

Galla Jayadev updates.