కోహ్లి పై కోపంతో కుర్చీలను తన్నిన గంభీర్‌(వీడియో)

Gambir kicks chairs due to angry on Kohli

06:27 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Gambir kicks chairs due to angry on Kohli

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో 'స్లో ఓవర్ రేట్' కారణంగా విరాట్ కోహ్లీకు భారీ జరిమానా పడింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ.. అతిగా ప్రవర్తించి, కుర్చీని కాలుతో తన్నిన గంభీర్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించగా, కోహ్లీ టీమ్‌కు రూ.66 లక్షల భారీ జరిమానా విధించారు. 19వ ఓవర్ చివరి బంతికి క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయం ఖరారయినప్పుడు కెప్టెన్ గంభీర్ కోపంగా లేచి, చేతిలో ఉన్న టవల్ ను బౌండరీ మీదకు విసిరాడు.

అంతటితో ఆగకుండా ఆటగాళ్లు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన కుర్చీలను కాలితో బలంగా తన్నాడు. ఈ దృశ్యాలు ప్రత్యక్షంగా ప్రసారం కావడంతో గంభీర్ ప్రవర్తన చర్చనీయాంశమైంది. గంభీర్ కు ఫైన్ వేస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ బుధవారం ప్రకటించారు. ఇక కోహ్లీ విషయానికి వస్తే గతంలోనూ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన ఈ బెంగళూరు కెప్టెన్.. కోల్ కతాతో మ్యాచ్ లోనూ ఓవర్లు స్లోగా వేయించాడు. దీంతో మొత్తం జట్టు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా ఒక్కో ఆటగాడికి రూ. 6 లక్షల జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ పేర్కొన్నారు.


English summary

Gambir kicks chairs due to angry on Kohli. Gautam Gambhir kicks chairs at ground due to angry on Virat Kohli.