ఈ నోటులో గాంధీ మిస్ అయ్యాడు

Gandhi Photo Missing In New 2000 Rupee Note

11:25 AM ON 6th January, 2017 By Mirchi Vilas

Gandhi Photo Missing In New 2000 Rupee Note

పెద్ద నోట్ల రద్దుతో అసలే అష్టకష్టాలు పడుతున్న సామాన్యులకు షాకులకు కొదవలేదు. ఇప్పుడు మరో షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే రెండువేల నోట్లు నకిలీవి అక్కడక్కడా హల్ చల్ చేస్తుండగా, తాజాగా కొత్త 2 వేల నోట్లలో గాంధీ బొమ్మ కనబడకుండా పోయింది. దీంతో సదరు వ్యక్తులు షాకయ్యారు. మధ్యప్రదేశ్ శివ పూర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో రైతులు ఇలాంటి నోట్లు చూసి నిర్ఘాంతపోయారు. అది బిచ్చు గౌడీ అనే గ్రామం. ఆ గ్రామంలో ఎస్.బీ.ఐ ఏ టీ ఏం నుంచి తాము విత్ డ్రా చేసుకున్న రెండు 2 వేల నోట్లలో గాంధీ బొమ్మ కనబడలేదు వీరికి. ఈ విషయాన్ని వాళ్ళు బ్యాంకు అధికారుల దృష్టికి తేగా..ఇవి అసలైన నోట్లేనని, నకిలీవి కావని అంటూ వాటిని వెనక్కి తీసేసుకున్నారు. బహుశా ప్రింటింగ్ లోపమై ఉంటుందన్నారు. ఆ మధ్య హోషంగాబాద్ లోని ప్రింటింగ్ అయిన 80 వేల 500 నోట్లలో కూడా ఎన్నో పొరబాట్లు దొర్లాయి.వాటిని సరిదిద్ది తిరిగి సరికొత్త నోట్లు ప్రింట్ చేసేసరికి సిబ్బందికి తల ప్రాణం తోక కొచ్చినంత పనయింది. ఇంకా ఇలాంటి తప్పులెన్ని ఉన్నాయో సరిచూస్తే, మంచిదని లేదంటే, ప్రమాదం ముంచుకొస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: రేప్ చేసిన మహిళనే….8 ఏళ్ల తర్వాత ఎం చేసాడో తెలుసా

ఇవి కూడా చదవండి:కారులో ఆమె ... బయట బుసలు కొడుతున్న పాము .. ఇంతకీ ఏమైంది? (వీడియో)

English summary

After the cancellation of old currency notes people in India were suffering still now for money and now a villagers got new 2000 rupee notes from SBI ATM in Madhya Pradesh. They were shocke by seeing that currency notes and the bank manager taken that currency notes and he gave new notes. The manager said that this happened because of some printing problems in the press.