రైల్వే జోన్ కోసం వినాయకునికి పూజలు

Ganesh Puja For Vizag Railway Zone

02:33 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Ganesh Puja For Vizag Railway Zone

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం విశాఖలోని సంపత్‌ వినాయక ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి, నిరోద్యగ పోరాటసమితి సంయుక్తంగా పూజలు నిర్వహించారు. వాల్తేరు డివిజన్‌లో ఉన్న తూర్పు కోస్తా రైల్వేలో అన్ని మౌలిక వసతులు ఉన్నప్పటికీ ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేయడంలో కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 6 నెలల్లో విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పార్లమెంట్బ డ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపధ్యంలో వత్తిడి పెంచేందుకు ఆందోళనలో భాగంగా గణేష్ కి పూజలు జరిపారు.

English summary

Andhra Pradesh Student federation has done Puja to Shri Lord Ganesha in Vishakapatnam for demanding Special Railway Zone to Vishakapatnam.