బెంగళూరు లో దారుణం కొడుకు కళ్ల ముందే తల్లిని రేప్‌ చేశారు

Gang Rape in Bangalore

06:01 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Gang Rape in Bangalore

మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని అందరూ మహిళలు ఆనందంగా వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ మాత్రం దారుణంగా నష్టపోయింది. అసలు వివరాల్లోకెళితే ఇటీవల కాలంలో మహిళలపై ఎక్కువగా దారుణాలు జరుగుతున్న బెంగుళూరులో మరో మహిళ బలైపోయింది. కన్న కొడుకు కళ్ల ముందే తన తల్లిని దారుణంగా రేప్‌ చేసి అనుభవించారు. బెంగుళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ దగ్గరలో ఉన్న నాయకనహళ్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబంలో జరిగిన గొడవలు వల్ల తన 14 ఏళ్ల కుమారుడితో బయటకు వచ్చేసి ఉంటున్న 35 ఏళ్ల సంవత్సరాలు గల యువతిని రేప్‌ చేశారు.

అయితే ఈ రేప్‌ చేసింది ఎవరో కాదు తమ కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తే ఈ పని చేశాడు. స్థానికజిల్లా పంచాయతి సభ్యుడుగా పని చేస్తున్న సంతోష్‌ రెడ్డి అనే వ్యక్తి ఈ పని చేశాడు. సంతోష్‌ రెడ్డి తనతో పాటు మరో ఇద్దరి వ్యక్తులని ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి ఆ యువతి ఇంటికి వెళ్లారు. కుటుంబ వివాదం విషయం మాట్లాడుతున్నట్లు ఒక్కసారిగా ఆమె పైకి విరుచుకుపడ్డారు. ఆమె 14 ఏళ్ల కొడుకు అడ్డు రావడంతో తనని బంధించి తన ఎదురుగానే ఆమెను గ్యాంగ్‌ రేప్‌ చేశారు. ఆమెని మాన భంగం చేయడమే కాకుండా ఆ దారుణాన్నంతా సెల్‌ఫోన్‌ లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియో అందరికీ చూపిస్తామని బెధిరించడంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు ఇవ్వలేక పోయింది.

అయితే తరువాత ఆమె స్నేహితులు, బంధువులు ధైర్యం చెప్పడంతో వాళ్ళ పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దుర్మార్గుడైన సంతోష్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేశారు. మిగతా ఇద్దరూ తప్పించుకున్నారు. ప్రస్తుతం వారి కోసం పోలీస్ లు గాలిస్తున్నారు.

English summary

A man whos is called as Santhosh Reddy raped a women in Bangalore. Santhosh Reddy taken his two friends with him and make a Gang Rape.