రాజమహేంద్రవరంలో ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన మహిళను రేప్ చేసారు

Gang rape in Rajamahendravaram

12:49 PM ON 18th April, 2016 By Mirchi Vilas

Gang rape in Rajamahendravaram

రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూడా మరో దారుణం చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే కేర‌ళ‌కు చెందిన ఓ మహిళ రాజమహేంద్రవరంలో జ‌రిగే త‌న స్నేహితురాలి పెళ్లికి వ‌చ్చింది కేరళ నుండి వచ్చింది. ఆమె రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే ఆమె పై క‌న్నేసిన ముగ్గురు రౌడీ షీటర్లు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి… ఆమెను రేప్ చేశారు. ఆమెను ముగ్గురు రౌడీషీట‌ర్లు గ్యాంగ్‌రేప్ చేశాక ఆ మహిళను ఆదివారం ఆటోలో రాజమహేంద్రవరంకి తీసుకు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో ఆటోలో ఉన్న మహిళతో పాటు ఆ ముగ్గురు రౌడీషీట‌ర్లు కూడా తీవ్రంగా గాయ‌ ప‌డ్డారు. ఆ సంఘటన చుసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. యాక్సిడెంట్ జ‌రిగింద‌ని సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ చెప్పిన మాట‌లు విని షాక్ కి గురయ్యారు. దీంతో ఆమెను హాస్పిటల్ కి తరలించారు. అలాగే ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని… హాస్పిటల్ కి తరలించారు. వారి పై కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. బాధితురాలు కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయని అని పోలీసులు తెలిపారు.

రాజమహేంద్రవరం టీటీడీ కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి కి హాజరు కావడం కోసం శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు కామంధులైన రౌడీషీటర్లు ఆమెను తీసుకుపోయి అత్యాచారం పోలీసులు తెలిపారు.

English summary

Gang rape in Rajamahendravaram. 3 rowdy sheeters gang raped a girl in Rajamahendravaram.