తల్లీ కూతుళ్ళపై గ్యాంగ్ రేప్(వీడియో)

Gang rape on mother and daughter

12:00 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Gang rape on mother and daughter

దేశంలో అరాచకాలు, అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలున్నా సరే, దాడులు, అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఏకంగా తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. యూపీలోని బులంద్ షహర్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివారాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన 35 ఏళ్ళ మహిళ పైన, ఆమె 14 ఏళ్ళ కూతురు పైన కొందరు దోపిడీ దొంగలు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నింధితుడు పరారీలో ఉన్నాడని, అతడి పట్టివేత కోసం ప్రత్యేక బృందాలను నియమించామని పోలీసు అధికారులు చెప్పారు.

బాధిత మహిళలు తమ నలుగురు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి నోయిడా నుంచి షాజహాన్ పూర్ వెళ్తుండగా.. దోస్త్ పూర్ గ్రామం వద్ద దోపిడీ దొంగలు వీరి కారును అడ్డగించి ఈ దారుణానికి దిగారు. సుమారు మూడు గంటలసేపు వారిని నరకయాతన పెట్టారు. బాధితుల నుంచి 11 వేల రూపాయలు, కొన్ని నగలు దోచుకుని పారిపోయారు. బాధితుల కారు బురదలో కూరుకుపోగా రాత్రంతా అక్కడే చిక్కుకుపోయారు. శనివారం ఉదయం అతి కష్టం మీద పోలీసు స్టేషన్ చేరుకొని తమ గోడును వినిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

English summary

Gang rape on mother and daughter