గన్ తో బెధిరించి టీచర్ పై గ్యాంగ్ రేప్.. ఆపై..

Gang rape on teacher

12:56 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Gang rape on teacher

రోజులాగే ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలోని 24వ హైవే సమీపంలో మంగళవారం మహిళా టీచర్ స్కూల్ కు బయలుదేరింది. మార్గం మధ్యలో కొందరు దుండగులు తుపాకీతో ఆమెను బెధిరించి కారులో కిడ్నాప్ చేశారు. తరువాత వేగంగా వెలుతున్న కారులో ఆమె మీద ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో చిత్రీకరించారు. అత్యాచారం జరిగిన విషయం బయటకు చెప్పవద్దని తుపాకీతో ఆమెను బెధిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, నీ పరువు పోతుందని బెధిరించారు.

అయితే బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు బాధితురాలిని వదిలి పెట్టిన ప్రదేశం దగ్గర వెళ్లిన పోలీసులు అక్కడ గాలించి కొన్ని ఆధారాలు సేకరించారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు. నిర్లక్షంగా విధులు నిర్వహించిన సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాజేష్ సింగ్ ను సస్పెండ్ చేశామని పై అధికారులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బులందర్ షహర్ గ్యాంగ్ రేప్ సంఘటన మరువకముందే టీచర్ మీద గ్యాంగ్ రేప్ జరగడంతో ప్రభుత్వం మీద ప్రజలు మండిపడుతున్నారు.

English summary

Gang rape on teacher