కండల వీరుడిపై బిగుస్తున్న ఉచ్చు - రూ.10కోట్లకు పరువు నష్టం దావా

Gang rape victim sends notice to Bollywood hero Salman khan

11:29 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Gang rape victim sends notice to Bollywood hero Salman khan

మొత్తానికి బాలీవుడ్ హీరో సల్మాన్ చేసిన రేప్ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలి వానగా మారాయి. నిను వీడని నీడను నేను అన్నట్లు గా కండలవీరుడ్ని ఆ వ్యాఖ్యలు నీడలా వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అనేక విమర్శలకు లోనైన సల్మాన్ ఇప్పుడు కోర్టులో పరువునష్టం కేసుకూడా ఎదుర్కోబోతున్నాడు. హర్యానా లోని హిసార్ జిల్లాకు చెందిన గ్యాంగ్ రేప్ బాధితురాలు సల్మాన్ నుంచి క్షమాపణ కోరడమేకాక, రేప్ బాధితులకు పరిహారంగా పదికోట్ల రూపాయలు చెల్లించాలని కాన్పూర్, లక్నో కోర్టుల్లో కేసు వేసింది.

ఈ మేరకు సల్మాన్ నివాసమైన ముంబై బంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్స్ కు తమతరపు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించింది. కాగా, సల్మాన్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు నాలుగేళ్ల క్రితం హిసార్ లో 10మంది చేత గ్యాంగ్ రేప్ కు గురైంది. ఈ కేసులో పదిమందిని దోషులుగా తేల్చిన కోర్టు వారందరికీ యావజ్జీవకారాగార శిక్ష విధించింది. ఇదిలాఉంటే, తన లేటెస్ట్ మూవీ 'సుల్తాన్' ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన సల్మాన్, ప్రతిరోజూ షూటింగ్ పూర్తయిన తర్వాత రేప్ కు గురైన మహిళ ఎలా ఫీల్ అవుతుందో తానూ అలాంటి బాధలే అనుభవించేవాడినని వ్యాఖ్యానించ డమే కొంప ముంచింది. అందుకే నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇదిగో సల్మాన్ లా ఇరుక్కోవడం ఖాయం.

ఇది కూడా చూడండి: సిలికా జెల్ సంచుల వలన కలిగే ఉపయోగాలు

ఇది కూడా చూడండి: క్రికెటర్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇది కూడా చూడండి: ప్రేమికులు తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు

English summary

Gang rape victim sends legal notice to Bollywood hero Salman khan.