బ్రేకింగ్ న్యూస్ - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ నయీం హతం

Gangster Nayeem Encountered in Shadnagar

11:53 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Gangster Nayeem Encountered in Shadnagar

హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ లో ఉన్న మిలీనియం టౌన్ షిప్ లో ఈరోజు కాల్పులు కలకలం రేపాయి. గ్రేహౌండ్స్ పోలీసులు. నల్గొండ స్పెషల్ పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ గ్యాంగ్ స్టర్ నయీం హతమైనట్లు తెలుస్తోంది. నయీం ను హతం చేసిన పోలీసులు ఇంకా మరికొందరి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. షాద్ నగర్ లో ఉన్న మిలీనియం టౌన్ షిప్ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సోదాలు చేపట్టారు. కొంతకాలంగా గ్యాంగ్ స్టర్ నయీం ఇక్కడే తలదాచుకున్నట్లు పక్కా సమాచారంతో మిలీనియం టౌన్ షిప్ ను చుట్టుముట్టిన పోలీసు బలగాలు నయీంను కాల్చిచంపాయి. మిలీనియం టౌన్ షిప్ లో ఇంకా 10 మంది వరకు నయీం అనుచరులు తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం షాద్ నగర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

గత కొద్దిరోజులుగా ఇంటెలిజెన్స్ వర్గాలు నయీం కదలికల పై దృష్టిసారించాయి. నయీంను టార్గెట్ చేయాల్సిందిగా ప్రభుత్వ పెద్దల నుంచి పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నయీంపై ఎస్ ఐబీ, గ్రేహౌండ్స్ పోలీసులు ఎటాక్ చేసినట్లు సమాచారం. నయీంపై పెద్ద నేరచరిత్రే ఉంది. పటోళ్ల గోవదర్ద న్ రెడ్డి హత్య కేసులో నయీం నిందితుడు.

100కి పైగా కేసులలో నిందితుడు

తెలంగాణా లోని నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన గ్యాంగ్ స్టర్ నయీం పై వందకు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యలు, భూదందాలు, సెటిల్ మెంట్లకు నయీం పాల్పడ్డాడు. ఐపీఎస్ అధికారి వ్యాస్ , మాజీ మావోయిస్టు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నయీం మృతిని ప్రభుత్వ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. నయీం హతంతో జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటనలు కూడా రద్దు అయ్యాయి.

ఇవి కూడా చదవండి:హవ్వ! ఆ నేరం చేసినోడికి 50 గుంజీలతో శిక్ష సరిపెట్టేశారట!

ఇవి కూడా చదవండి:కృష్ణలో మునిగిన సంగమేశ్వరుడు

English summary

Most wanted Criminal Gang Ster Nayeem was encountered by NIA in Shadnagar in Hyderabad. Police was attacked and killed him and some of his followers in a house in Shad Nagar. Nayeem was the main abused person in 100 plus cases in Telangana.