నయీమ్ దగ్గర ఎవరి జాతకాలున్నాయో తెలుసా

Gangster Nayeem Links With Politicians And Police Officers

12:35 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Gangster Nayeem Links With Politicians And Police Officers

ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం గురించి రోజుకో షాకింగ్‌న్యూస్ వెలుగు చూస్తోంది. నయీం మరణించిన తర్వాత పోలీసుల వివిధ ప్రాంతాల్లో అతడి ఆస్తులపై సోదాలు చేపట్టారు. ఇందులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. ఇక  నిన్నటివరకు గ్యాంగ్‌స్టర్ చిట్టాలో జర్నలిస్టులున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా  పోలీసు బాసులతోపాటు రాజకీయ నేతలు, రియల్టర్లు ఉన్నారట. ఈ  బ్రేకింగ్ న్యూస్ బెంబేలెత్తిస్తోంది. 

1/7 Pages

బెడ్‌రూం డైరీ భాగోతం ..

కోర్టు అనుమతితో సిట్ బృందం హస్తినాపూర్‌లోని నయీం ఇంటి చేరుకుని, రెవెన్యూ అధికారుల సమక్షంలో గదుల తాళాలను తెరిచింది. తొలుత గదుల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఆ తర్వాత అతడి బెడ్‌రూమ్‌ని ఓపెన్ చేసిన అధికారుల కు దిమ్మతిరిగింది. ఒకటా రెండా ఏకంగా 10 డైరీలు కంటపడేసరికి, నివ్వెరపోయారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో పోలీసులు, రాజకీయ నేతలు, రియల్టర్లు, జర్నలిస్టుల పేర్లు వున్నట్లు చెప్పుకుంటున్నారు.

English summary

Recently Gangster Nayeem was encountered by NIA police in Shad Nagar in Hyderabad. Police opened diaries of Nayeem and officials found that Nayeem has links with Politicians and Police Officials.