అప్పట్లో నేను , చిరు కన్నీరు పెట్టుకున్నాం

Ganta Srinivasa Rao About Chiranjeevi At Open Heart With Rk

11:48 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Ganta Srinivasa Rao About Chiranjeevi At Open Heart With Rk

మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ఆప్తుడు ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు...ఒకనాడు మెగాస్టార్ చిరంజీవికి, తనకు మధ్య ఉండిన అనుబంధాన్ని గంటా శ్రీనివాస రావు వివరించారు. ప్రజారాజ్యం పార్టీని వదలి.. తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఎంతో భావోద్వేగం చెందా అని ఆయన తెలిపారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. చిరంజీవి ఆ నాడు పెట్టిన ‘ప్రజారాజ్యం’ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు తాను చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని చిరుకు చెబుతున్నప్పుడు తన కళ్ళ వెంట నీరు ఆగలేదని, అయితే చిరు కూడా కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ఎక్కడ ఉన్నా నువ్వు బాగుండాలంటూ చిరంజీవి తన క్షేమాన్ని కోరారని అన్నారు.

ఇవి కూడా చదవండి: మహేష్ డైరెక్షన్ అదిరింది

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబే రాష్ట్రానికి సరైన నేత అని భావించి తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. తన నిర్ణయాన్ని చిరంజీవికి చెప్పినప్పుడు.. వైసీపీలోకి నువ్వు వెళ్ళడం లేదు..అదే నాకు సంతోషం అని వ్యాఖ్యానించారన్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలాగో తనను కూడా చిరు అలాగే చూశారని గంటా తెలిపారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉంటే 2019లో జరిగే ఎన్నికల్లో టీడీపీ గెలుపు సునాయాసమని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సమస్య నేపథ్యంలో కేంద్రం నుంచి తప్పుకోవడం టీడీపీకి నిముషంలో పని.. అలా చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట ఉన్న బిజెపికే నష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా గండాన్ని తెలుగుదేశం పార్టీ సులభంగా అధిగమించగలదన్న విశ్వాసాన్ని గంటా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసేదీ లేనిదీ ఇప్పుడే చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: పిల్లాడే కదా అని ముద్దులు కురిపిస్తే ..

ఇవి కూడా చదవండి: రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

English summary

Andhra Pradesh Education Minister Ghanta Srinivasa Rao said some interesting words about the relationship with Mega Star Chiranjeevi. He Said that Chiranjeevi treated him as his own brother . After Andhra Pradesh State Dividing so he decided to join in TDP and he said this thing to Chiranjeevi.