మంత్రి కొడుకే హీరో అయితే..

Ganta Srinivasa Rao Son To Give Film Entry

11:06 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Ganta Srinivasa Rao Son To Give Film Entry

టాలీవుడ్ లోకి మరో కొత్త హీరో వస్తున్నాడు. ఈ కుర్ర హీరో ఎపి పొలిటికల్ లీడర్ తనయుడు కావడం విశేషం. అంతేకాదు ఓ మంత్రి కొడుకు కూడా.. వెండితెరమీదకు హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కొత్త హీరో ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కొడుకే...గంటా తనయుడు రవి హీరోగా 'కాళహస్తి' సినిమా గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ చేశారు.

చాలాకాలం తర్వాత జయంత్ సిపరాన్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ శారద ఆర్ట్స్ బ్యాన ర్ పై రూపొందుతోంది. అనిల్ కుమార్ కిషేన్ నిర్మిస్తున్న ఈ సినిమా కి సంబంధించి, హీరో గంటా రవి పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు క్లాప్ ఇచ్చారు. దర్శకేంద్రుడు రాఘ వేంద్రరావు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు, నిర్మాత అశోక్ కుమార్, గంటా కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సత్సబంధాలు గల గంటా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ, కొడుకు మెగా హీరో అంతటి వాడవ్వాలని అనుకున్నారని భావించవచ్చా.

ఇవి కూడా చదవండి:బాలికల స్కూళ్ళకు వెళ్ళడానికి మగ టీచర్లకు కండీషన్

ఇవి కూడా చదవండి:ముందే గ్లామర్ టచ్ ఇచ్చిన గోవా బ్యూటీ

English summary

Andhra Pradesh Education Minister Ganta Srinivasa Rao's Son Ganta Ravi was going to make his Tollywood Debut by the movie Name "Kalahasti" and this movie was started yesterday in Ramanaidu Studio in HYderabad.