ఆది పుట్టినరోజున 'గరం' ఆడియో!

Garam audio launch on Aadi bithday

11:49 AM ON 21st December, 2015 By Mirchi Vilas

Garam audio launch on Aadi bithday

సాయి కుమార్‌ తనయుడు ఆది హీరోగా ఆదాశర్మ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గరం'. వరుస ఫ్లాప్స్‌ తో సతమతవుతున్న ఆది ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నాడు. పెళ్లైన కొత్తలో, ప్రవరాఖ్యుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మదన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీమతి వసంత శ్రీనివాస్‌ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్‌ బ్యానర్‌ పై పి. సురేఖ నిర్మించిన ఈ చిత్రం ఆడియోని హీరో ఆది పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 23న విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా నిర్వహించే ఈ ఆడియో వేడుకకు సినీ రంగ ప్రముఖులు పాల్గొనబోతున్నన్నారు. 'పెళ్లైన కొత్తలో ఫేమ్‌ అగస్త్య ఈ చిత్రానికి సంగీతం అందించారు.

English summary

Garam audio launch on Hero Aadi's birth day December 23rd.