16 కూరల విందు భోజనం ...

Garam Release Date

12:43 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Garam Release Date

నటుడు సాయికుమార్ తనయుడు ఆది, ఆదాశర్మ జంటగా నటించిన కొత్త సినిమా ‘గరం‌’ విడుదలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వసంత్ శ్రీనివాస్‌ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై రూపొందింది. మదన్ దర్శకత్వం వహించారు. పి.సురేఖ నిర్మాత కాగా, సహ నిర్మాత బాబ్జీ.

ఈ సినిమా అన్నివర్గాలను అలరిస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా ‘గరం’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఫీల్‌గుడ్‌ సినిమా. సోల్‌ ఉంటుంది. ఆది డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. అగస్త్య సంగీతం బావుంది. చక్కటి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను యు.ఎస్‌ లోనూ పెద్ద రేంజ్‌లో విడుదల చేస్తున్నాం’’ అని వివరించాడు. ఈ ఏడాది విడుదలైన సినిమాలన్నిటికీ మంచి స్పందన వస్తోందని చెబుతూ గరం కూడా మంచి టాక్ తో నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసాడు.

సీనియర్‌ నరేష్ మాట్లాడుతూ ‘‘16కూరల విందు భోజనం లాంటి సినిమా ఇది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ఆది ఇందులో మాస్‌ పించింగ్‌ ఉన్న కేరక్టర్‌ చేశాడు’’ అని చెప్పారు. ‘‘పదో తరగతి పరీక్షలు రాసిన కుర్రాడు రిజల్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా నా పరిస్థితి ఉంది. వచ్చేనెల 12న విడుదల చేస్తున్నామని మా నాన్నగారు చెప్పినప్పుడు చాలా నెర్వ్‌సగా, ఎగ్జయిట్‌మెంట్‌గా ఫీలయ్యాను. ఈ సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేను’’ అని ఆది వివరించాడు.

English summary

Veteran Hero Sai Kumar's son Young Hero Aadi's latest movie Garam.This movie was going to be released on february 12th.Actor Senior Naresh Says that this movie was a complete family entertainer